ఒంట్లో మొండి కొవ్వు కరిగించాలంటే..ఒళ్లు వంచాల్సిందే!

ప్రస్తుతం అందరూ ఏసీ రూముల్లో కంప్యూటర్ల ముందే పని చేస్తున్నారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కదిలే పనిలేకపోయింది. ఇంక రాత్రుళ్లు... పది దాటితే కానీ తినట్లేదు.

పోనీ ఆ డిన్నర్ అయినా ఇడ్లీ, సాంబార్ ఉంటుందా అంటే ఆహా..! బిర్యాని విత్ కోక్ ఉండాల్సిందే. పండ్లు తినడం మానేసి... పండ్ల పేర్లలో దొరికే కూల్డ్రింక్స్ కు అలవాటుపడ్డారు. 

ఇక ఉదయం తొమ్మిది దాటితే కాని నిద్ర లేపట్లేదు చాలామంది. మరి లావు కాక ఏమైతారు. చేయాల్సినవి చేసే పద్ధతిలో చేయకుండా....లవయ్యాక, కొవ్వు బాగా పేరుకున్నాక లబోదిబోమంటున్నారు. సరే, ఇప్పుడైనా మించిపోయిందేం లేదు బరువు తగ్గాలా? ఒంట్లోని మొండి కొవ్వును కరిగించుకోవాలా? అయితే నోరు కట్టేయాలి.  కాస్తంత ఒళ్లు వంచాల్సిందే.

ఒకప్పటి మనుషులు కోడి కూతకంటే ముందే లేచి పనికి పోయేవాళ్లు. మధ్యాహ్నం ఎక్కడున్నా టైమ్‌కి తినడం, మళ్లా రాత్రికి ఇంత తిని తొందరగా నిద్రపోవడం చేసేవాళ్లు.

అందుకే అప్పటోళ్లలో ఊబకాయం సమస్యే ఉండేది కాదు. తింటే అన్నం లేదా ఆయా కాలాల్లో దొరికే పండ్లు, అంతే. అందుకే ఎండకు ఎంత పనిచేసినా అలసిపోయే వాళ్లు కాదు. 

ఆ కాయకష్టమే వాళ్లను కాపాడింది. మరి ఇప్పుడో..పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎవరి నోట విన్నా బరువు తగ్గాలి.. లావైపోయాను అనే మాటలే వినిపిస్తున్నాయి. అలా బాధపడటం మానేసి సరైన పద్ధతిలో వ్యాయామం చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తే బరువు తగ్గొచ్చు అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ 'సందీప్ చక్రవర్తి'. అదెలాగో చూద్దాం.

క్యాలరీలదే ముఖ్య పాత్ర

బరువు తగ్గే ప్రయలో క్యాలరీలే ప్రధానం. రోజుకు ఎన్ని క్యాలరీలు తీసుకోవాలి, ఎన్ని క్యాలరీలు కరిగించాలి వంటివి చాలా ముఖ్యం. అలా కాకుండా పీకల దాకా తిని, గంటల తరబడి వ్యాయామం చేస్తే, చివరికి కండరాల నొప్పులే మిగులుతాయి.కండరాలు పెరగాలన్నా, తగ్గాలన్నా వాటికి 24 గంటల విశ్రాంతి కావాలి. అలాగే శరీరం ఏ మార్పుకు స్పందించాలన్నా కనీసం 4 నుంచి 6 వారాల సమయం పడుతుంది. శరీరంలో ఉండే 436 గ్రాముల కొవ్యు విలువ 3,500 క్యాలరీలు

తగ్గాలని ఉంది 

న్యూ ఇయర్ కు తీసుకునే రిజల్యూషన్లో 34 శాతం మంది మహిళలు, 26శాతం మంది పురుషులు..బరువు తగ్గాలనే కోరుకుంటున్నారని అధ్యయనాలు చెబుతు న్నాయి. కాకపోతే కొన్ని రోజులు కష్టపడి బరువేం తగ్గట్లేదని మానేస్తుంటారు కొందరు. అలాగే తొందరగా తగ్గాలనే ఆత్రుతతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు ఇంకొందరు. వివరీతంగా ఓ పద్ధతి లేకుండా వ్యాయామం లేసి తక్కువ సమయంలో ఎక్కువ బరువుల అది మంచిది కాదు. పైగా చర్మం వదులవుతుంది కూడా ఈ రెండూ పొరపాటే ఏది చేసినా నిపుణుల సలహా తీసుకుని క్రమపద్ధతిలో చేయాలి

ఇవి పాటించాలి

1 బరువు తగ్గే ప్రక్రియ మొదలుపెట్టే ముందు కనీసం మూడు వారాల ముందు నుంచి వామన్స్ తప్పనిసరిగా చేయాలి. అందులో స్విమ్మింగ్, రన్నింగ్, జాగింగ్ కి బాక్సింగ్. సైక్లింగ్ లాంటివి కనీసం ఒక 40 నిమిషాలైనా చేయాలి.అప్పుడు శరీరంలో ఉన్న కొవ్వు కరగడం మొదలవుతుంది. ఇలా చేస్తేనే తర్వాతర్వాత కఠినంగా ఉండే వర్కవుట్లు చేయడానికి శరీరం సన్నద్ధమవుతుంది. 

2.  స్టైలింగ్ వ్యాయామాలు రోజూ 15 నిమిషాల పాటు స్టైలింగ్ వ్యాయామాలు చేస్తే కండరాలు ఎలా అంటే అలా వంగడానికి అనువుగా తయారవుతాయి. ముఖ్యంగా ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. కార్టియో వర్కవుట్లు, చేసే ముందు కచ్చితంగా ఈ స్టైలింగ్ వ్యాయామాలు చేయాలి.

3. సరైన డైట్ పాటించకపోతే  బరువు తగ్గడం అసాధ్యం. రోజూ తీసుకునే ఆహారంలో కొవ్వు తక్కువగా ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూడాలి. అలాగే కార్బోహైడ్రేటకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇహారంలో చేపలు, తాజా పండ్లు, కూరగాయలు చేర్చాలి. అయితే. బరువు తగ్గడానికి రోజుకు 1200 క్యాలరీల కంటే ఎక్కువ తీసుకోవద్దు. తిండి తగ్గితే తీసుకునే క్యాలరీల సంఖ్య కూడా తగ్గుతుంది. 

అందుకే మధ్యాహ్నం రాత్రుళ్లు భోజనానికి పావు గంట ముందు బ్లాక్ కాఫీ తాగాలి. అలా చేస్తే అందులోని కెఫిన్ ఆకలి తినాలనే కోరికను తగ్గిస్తుంది. అలా తీసుకునే ఆహారం తగ్గిస్తే.. 

శక్తి కోసం పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగిస్తుంది. అలా క్యాలరీలు కరుగుతాయి.

4 .  మెట్లు ఎక్కాల్సి వచ్చిన ప్రతిసారీ లిఫ్ట్ ను వాడకుండాఎక్కాలి. అలా చేసినా చాలా క్యాలరీలే కరుగుతాయి.

5. తీసుకునే ఆహారంలో ఉప్పును అధికంగా తీసుకోవద్దు..ఎంత వీలైతే అంత తగ్గించాలి.

6.  సీరియస్ గా బరువు, కొవ్వు తగ్గించుకోవాలంటే బయట దొరికే డైట్ కోక్, స్నాక్స్ జోలికి వెళ్లాద్దు. అవి పూర్తిగా ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక క్యాలరీలతో ఉంటాయి. వాటిలో ఒక్కశాతం కూడా పోషక విలువలు ఉండవు.7. కూల్ డ్రింక్స్, ఆల్క్ హల్ పూర్తిగా మనేయాలి. ఇవి అధిక సంఖ్యలో ఖాళీ క్యాలరీలను శరీరంలోకి చేర్చుతాయి. ఆ కొవ్వే శరీరం లో మొండిగా పేరుకుపోతుంది. ధూమపానం కూడా ఆపేయాలి.  అది ఒంట్లోని స్టామినాను,  అలాగే బరువు ఎత్తే సమయంలో ఊపిదితిత్తులకున్న గాలితీసుకునే సామర్థ్యాన్నితగ్గిస్తుంది.

-v6 వెలుగు లైఫ్ స్టోరీ