జాగ్రత్త.. ! అర్ధరాత్రి వరకు మేల్కొంటే గుండెపోటు..!

రాత్రి ఆలస్యంగా పడుకొని.. ఉదయాన్నే నిద్ర లేచేందుకు ఇబ్బందులు పడేవారిలో గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా ఎక్కువని ఓ సర్వేలో తేలింది. అంతేకాదు.. వేళాపాళ లేకుండా తినడం, ఫాస్ట్ ఫుడ్, ఆల్కహాల్, స్వీట్స్ ఎక్కువగా తీసుకునేవారికీ ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువని తాజా అధ్యయనాలు తేల్చాయి. 

త్వరగా నిద్రపోయి.. తెల్లవారుజామున నిద్ర లేచేవారితో పోలిస్తే.. అర్ధరాత్రి ఆలస్యంగా నిద్రపోయే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే రిస్క్ 2.5 రెట్లు ఎక్కువని 'నెస్లే హెల్త్ సైన్స్' పరిశోధకులు తేల్చారు. ఆలస్యంగా తినడం కూడా టైప్2 డయాబెటిస్ కు దారితీస్తుందట. అందుకు కారణం.. సిర్కాడియం రిథమ్ అదుపు తప్పడమే.

Also Read :- శరీరంలో రక్తం పెరగాలంటే ఈ టిప్స్ పాటించండి

అందుకే అర్ధరాత్రి వరకు మేల్కొనేవారు నిద్ర పోయే ముందు తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది మెటబాలిజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అర్ధరాత్రి వరకు మేల్కొనే వాళ్లు.. వీకెండ్ లో ఎక్కువ సేపు నిద్రపోయి.. ఆ లోటును భర్తీ చేయాలని ఆలోచిస్తారట. అది కూడా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని అధ్యయనాల్లో తేలింది.