వైకుంఠ ఏకాదశికి గుడికి వెళ్లలేరా.. ఇంట్లోనే ఇలా చేయండి

వైకుంఠ ఏకాదశి రోజున గుడికి వెళ్లేందుకు అవకాశం లేదని చాలామంది బాధపడుతుంటారు. అలాంటి వారు ఇంట్లోనే కొన్ని ప్రత్యేక పూజలు చేస్తే పుణ్య ఫలం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.   ముక్కోటి ఏకాదశి రోజున గుడికి వెళ్లలేని వారు ఇంట్లో  ఏం చేయాలో ఒకసారి తెలుసుకుందాం,. . . 

వైకుంఠ ఏకాదశి అంటే ఏ దేవాలయం చూసినా భక్తులతో కిటకిటలాడుతుంది.  ఆరోజున ( డిసెంబర్​ 23) స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పాపపరిహారం జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కొంతమంది అనారోగ్యంతోనో.. చంటిపిల్లల తల్లులు.. వృద్దులు దేవాలయాలకు వెళ్లే పరిస్థితి ఉండదు.   అలాంటి వారు ఇంట్లోనే ఉండి దైవనామస్మరణ చేసుకున్నా అలాంటి ఫలితమే లభిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  


సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చక్కగా ఇంటిని శుభ్రపరచుకుని (Clean up) తలస్నానం చేసి తెల్లటి వస్త్రాలు ధరించి ఇంటి ముందు ముగ్గులు, గడపకు పసుపు, కుంకుమ రాసి పూలతో అలంకరించి, పూజ మందిరానికి మామిడి తోరణాలు కట్టి, ముగ్గు వేసి పసుపు, కుంకుమలతో అలంకరించాలి.

పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించాలి. స్వామివారికి పువ్వులు (Flowers), తులసి దళాలను సమర్పించాలి.

వైకుంఠ ఏకాదశి రోజున( డిసెంబర్​ 23) జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే సర్వపాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే విష్ణుమూర్తికి నైవేద్యంగా పాయసం (Payasam), తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను సమర్పించాలి. ఈ రోజున( డిసెంబర్​ 23) ఉపవాసం (Fasting) ఆచరిస్తే మంచి ఫలితం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున ( డిసెంబర్​ 23) ఉదయం 8 గంటలలోపు పూజను పూర్తి చేయాలి. ఈ రోజున ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీకు అన్నీ విజయాలే కలుగుతాయి.