టూల్స్  గాడ్జెట్స్ : ట్రయాంగిల్ మాప్

టూల్స్  గాడ్జెట్స్ : ట్రయాంగిల్ మాప్

 ఇల్లు క్లీన్‌‌ చేయడానికి రకరకాల మాప్‌‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఇది మాత్రం మల్టీఫంక్షనల్ డిజైన్ క్లీనింగ్ మాప్. చూడడానికి త్రిభుజాకారంలో ఉంటుంది. దీన్ని వ్యోక్స్ అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తెచ్చింది. దీని హెడ్‌‌ని 360 డిగ్రీల వరకూ రొటేట్ చేసుకోవచ్చు.  సోఫా, బెడ్, వాల్ కార్నర్‌‌లు, సీలింగ్ కార్నర్‌‌లు, కిటికీ మూలలు లాంటి డెడ్ కార్నర్‌‌లను కూడా శుభ్రం చేసుకోవచ్చు.

ఫ్లోర్‌‌‌‌ డ్రైగా ఉన్నా తడిగా ఉన్నా క్లీన్‌‌ చేసేస్తుంది. దీనికి ఎన్‌‌క్రిప్టెడ్ మైక్రోఫైబర్ మాప్ క్లాత్‌‌ ఉంటుంది. ఇది చాలా మన్నికైనది. ఎంత జిడ్డు మరకలైనా ఈజీగా క్లీన్ చేస్తుంది. నీటిని ఈజీగా గ్రహిస్తుంది. దుమ్ముని గట్టిగా పట్టుకుంటుంది. అందువల్ల చాలా శ్రమ తగ్గిపోతుంది. ఈ మాప్​ స్టిక్​ హ్యాండ్స్ ఫ్రీ రింగింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. చెక్క, టైల్, లామినేట్, వినైల్, స్టోన్‌‌, కాంక్రీట్‌‌.. ఎలాంటి ఫ్లోర్‌‌‌‌ మీద అయినా దీన్ని వాడొచ్చు. దీన్ని మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు. మాప్ పుష్–పుల్ ఆటోమేటిక్ స్క్వీజింగ్ ఉంటుంది. కాబట్టి చేతులను మురికి చేసుకోవాల్సిన అవసరం లేదు. 
ధర : 449 రూపాయలు 

యూవీ శానిటైజర్‌‌‌‌

టూత్‌‌ బ్రష్‌‌ని ఉదయం వాడి పక్కన పెడితే.. మళ్లీ మరుసటి రోజు ఉదయం వరకు దాని గురించి పట్టించుకోం. ఈ టైంలో దాని మీద బ్యాక్టీరియాలాంటిది చేరుతుంది. అలాంటప్పుడు ఇలా యూవీ(అల్ట్రా వయొలెట్‌‌) శానిటైజర్‌‌‌‌తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. డ్రెవిట్‌‌ ఎంటర్‌‌‌‌ప్రైజ్ కంపెనీ తీసుకొచ్చిన ఈ శానిటైజర్‌‌‌‌ స్టెరిలైజర్‌‌‌‌ త్రీ ఇన్‌‌ వన్ టూత్ బ్రష్ హోల్డర్‌‌‌‌గా కూడా పనిచేస్తుంది.

ఇది టూత్‌‌పేస్ట్ హోల్డర్, టూత్ బ్రష్ స్టెరిలైజర్, టూత్ బ్రష్ హోల్డర్‌‌లా పనిచేస్తుంది. ఇందులో 5 టూత్ బ్రష్‌‌లు పెట్టుకోవచ్చు. బ్రష్‌‌ని యూవీ స్టెరిలైజ్‌‌ చేయడం వల్ల నోటి దుర్వాసన, చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా చనిపోతుంది. 99.9 శాతం బాక్టీరియా, జెర్మ్స్‌‌ని చంపుతుంది.  4–6 నిమిషాల్లో  స్టెరిలైజ్​ అయిపోతుంది. అంతేకాకుండా ఇందులో వ్యాక్యూమ్ ప్రిన్సిపల్ పంపింగ్ టూత్‌‌పేస్ట్ స్క్వీజర్ ఉంటుంది. కాబట్టి టూత్‌‌పేస్ట్ డిస్పెన్సర్‌‌‌‌లా పనిచేస్తుంది. 
ధర : 1,199 రూపాయలు 

ఓరల్ ఇరిగేటర్ 

చాలామందికి ఫుడ్‌‌ తిన్నప్పుడు చిన్న చిన్న ముక్కలు పండ్లలో ఇరుక్కుపోతుంటాయి. దాంతో పళ్లలో ఏవో ఒకటి గుచ్చి వాటిని బయటకు తీస్తుంటారు. కానీ.. ఈ ఇరిగేటర్‌‌‌‌ ఉంటే అలాంటివి అవసరమే లేదు. పళ్లు, నోటిని ఈజీగా క్లీన్‌‌ చేసేసుకోవచ్చు. ఒరైమో అనే కంపెనీ దీన్ని మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది. దీంతో నోటిని క్లీన్ చేసుకుంటే 99 శాతం ఫుడ్ పార్టికల్స్ పోతాయి.

ఇది పవర్‌‌ఫుల్, పోర్టబుల్ ఓరల్ ఇరిగేటర్. బ్యాక్టీరియాను క్లీన్‌‌ చేయడానికి దీన్నుంచి నిమిషానికి 1,600 అల్ట్రాసోనిక్ వాటర్ పల్సెస్‌‌ వస్తాయి. ఇందులో 6 ఫ్లోజింగ్ మోడ్స్‌‌ ఉంటాయి. అందువల్ల అన్ని వయసుల వాళ్లకు  సరిపోతుంది. వాటర్ ప్రెజర్‌‌‌‌, మోడ్‌‌ మార్చుకోవడానికి బటన్స్ ఉంటాయి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 70 రోజుల వరకు వాడుకోవచ్చు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతుంది. 360 డిగ్రీల రొటేషన్ నాజిల్ ఉంటుంది. అందువల్ల నోటిలోని ప్రతి మూల క్లీన్‌‌ చేసుకోవచ్చు. దంత క్షయం, చిగుళ్ల రక్తస్రావం లాంటివి రాకుండా కాపాడుకోవచ్చు. దీనికి 240 ఎంఎల్‌‌ కెపాసిటీ లీక్ ప్రూఫ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. 
ధర : 1,999 రూపాయలు 

వ్రోక్లా మినీ మాప్‌‌ 

ఇంట్లో చిన్న చిన్న మూలలు, వాష్‌‌ బేసిన్‌‌, గ్యాస్‌‌ స్టవ్‌‌.. లాంటి వాటిని క్లీన్‌‌ చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ... ఈ మినీ మాప్‌‌ ఉంటే అలాంటి పనులు చిటికెలో చేసేయొచ్చు. దీన్ని వ్రోక్లా అనే కంపెనీ మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ఈ మాప్​ను ఏబీఎస్ ప్లాస్టిక్‌‌తో తయారుచేశారు. ఇందులో ఉండే స్పాంజ్ కూడా మన్నికైనది. హై అబ్జార్బెంట్‌‌ స్పాంజ్ ఉండడం వల్ల క్లీన్‌‌ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. అంతేకాదు.. ఇది సెల్ఫ్ స్క్వీజ్ డిజైన్‌‌తో వస్తుంది. కాంపాక్ట్, లైట్ వెయిట్ డిజైన్‌‌తో చేశారు. దీంతో వంటగదిలో సామాన్లు, మార్బుల్‌‌, గ్లాస్‌‌, బాత్రూమ్, కారు, వాష్‌‌బేసిన్, కిటికీలు, టేబుల్, డెస్క్‌‌టాప్ లాంటివన్నీ శుభ్రం చేసుకోవచ్చు. 
ధర : 349 రూపాయలు