అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు : వొడితల ప్రణవ్‌‌‌‌‌‌‌‌

  • ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ప్రణవ్‌‌‌‌‌‌‌‌ ఫైర్‌

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
హుజూరాబాద్,​ వెలుగు:
ఆధారాల్లేకుండా అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ శ్రేణులు తోలు తీస్తారని ఆ పార్టీ హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి వొడితల ప్రణవ్‌‌‌‌‌‌‌‌.. ఎమ్మెల్యే కౌశిక్‌‌‌‌‌‌‌‌రెడ్డిని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.  పట్టణంలోని పార్టీ ఆఫీసులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం, మంత్రులు, ప్రభుత్వంపై ఆధారాల్లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని ఎమ్మెల్యేను హెచ్చరించారు. 

ఫ్లైయాష్‌‌‌‌‌‌‌‌ తరలింపుపై మంత్రి పొన్నంపై కౌశిక్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దమ్ముంటే యాష్‌‌‌‌‌‌‌‌ తరలింపుపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి ఎన్ని అక్రమాలు చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఫ్లై యాష్ రాష్ట్రానికి సంబంధం ఉండదని, అది వేస్ట్ మెటీరియల్ గా దానిని బయటకు అమ్ముతారని, ఈ విషయంలో మంత్రి పొన్నంకు ఏం సంబంధమని ప్రశ్నించారు. 

ఫ్లై యాష్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్టుకు వే బిల్ కూడా ఉండదని దీనిపై ఎమ్మెల్యేకు కనీస పరిజ్ఞానం లేకపోవడం సిగ్గుచేటన్నారు. కౌశిక్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తూ.. బ్లాక్‌‌‌‌‌‌‌‌మెయిల్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారాడన్నారు. సమావేశంలో లీడర్లు పొనుగంటి మల్లయ్య, సాయిని రవి, శ్రీనివాస్, మిడిదొడ్డి రాజు, అమర్, శంకర్, బాబు, పాల్గొన్నారు.