వొడాఫోన్ కొత్త రీచార్జ్ ప్లాన్లు..నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఫ్రీ..వివరాలివిగో 

వొడాఫోన్ ఐడియా కొత్త రీచార్జ్ ప్లాన్లను పరిచయం చేస్తోంది. ఈ ప్లాన్లలో నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వనుంది. మొత్తం చెల్లుబాటు వ్యవధిలో ప్రత్యేకమైన రీచార్జ్ ప్లాన్లతో ఫ్రీ బేసిక్ నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తోంది. ఈ రీచార్చ్ ప్లాన్ల ద్వారానెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ తో పాటు రోజువారీ ఇంటర్నెట్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ప్రీ SMS బెనిఫిట్స్ ను కూడా అందిస్తుంది. గతేడాది ఎయిర్ టెల్, జియో కూడా ఇలాంటి నెట్ ఫ్లిక్ష్ సబ్ స్క్రిప్షన్ రీచార్జ్ ప్లాన్లను వాటి వినియోగ దారులకు అందిస్తున్నాయి. 

ఫ్రీ నెట్ ఫ్లిక్స్ వొడాఫోన్ రీచార్జ్ ప్లాన్ ధర, వ్యాలిడిటీ 

Vi ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్లు ఉచిత Netflix సబ్‌స్క్రిప్షన్‌ను పొందేందుకు కస్టమర్లకు రెండు రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. 
నెట్‌ఫ్లిక్స్ బండిల్ ప్రారంభ ధర రూ.998. ఇది అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100SMS లు,రోజుకు 1.5 GB డేటాతో 70 రోజుల నెట్ ఫ్లిక్స్ బేసిక్ సబ్ స్క్రిప్షన్ను అందిస్తుంది. ఈ ప్లాన్ గుజరాత్, ముంబై మినహా అన్ని సర్కిల్‌లలో అందుబాటులో ఉంది. గుజరాత్ , ముంబైలోని వినియోగదారులు అదే ఆఫర్ కోసం రూ.1,099 చెల్లించాల్సి ఉంటుంది. 

రెండవ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.1,399. ఇది అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఉచిత SMS, రోజుకు 2.5 GB డేటాతో 84 రోజుల పాటు Netflix బేసిక్ సబ్ స్క్రిప్షన్ ను అంది స్తుంది.