Vodafone Idea:ఐడియా కొత్త రీఛార్జ్ ప్లాన్‌.. ఏడాది పొడవునా ఉచిత డేటా

ప్రైవేట్ టెలికాం రంగంలో పోటీ బాగా పెరిగిందన్న విషయం మనకు తెలిసిందే..ఈ మధ్య కాలంలో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయిన BSNL కూడా ప్రైవేట్ టెలికం ఆపరేటర్లకు గట్టి పోటీనిస్తోంది. కస్టమర్లకు బెస్ట్ రీఛార్జ్ ఆఫర్లను అందిస్తోంది..దీంతో ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు కూడా కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో కొత్త కొత్త రీచార్జ్ ప్లాన్లను  తీసుకొస్తున్నాయి.. అందులో Vodafone Idea కూడా ఒకటి.. 

Vodafone Idea సూపర్ హీరో సిరీస్ కింద కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ప్రత్యర్థి టెలికం ఆపరేటర్లు అయిన జియో, ఎయిర్ టెల్ .. 4జి ప్లాన్లపై అన్ లిమిటెడ్ 5G డేటాను అందించడం ప్రారంభించడంతో వొడాఫోన్ ఐడియా కూడా ఏడాది మొత్తం ఉచిత డేటా ప్లాన్ ను తీసుకొచ్చింది. 

Vodafone Idea రూ. 3599, రూ. 3699, రూ. 3799 ధరతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇది ఏడాదంతా అర్థరాత్రి 12గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ లిమెటెడ్ ఉచిత డేటా అందిస్తాయి. రోజులో మిగిలిన 12 గంటలలో కస్టమర్లు రోజువారీ 2GB డేటాను యాక్సెస్ చేయవచ్చు. వినియోగించని రోజువారీ డేటా ఉంటే.. దానిని వారాంతంలో ఉపయోగించుకోవచ్చు.  

ప్రస్తుతం ఈ ప్లాన్లు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానాతో సహా ఎంపిక చేసిన టెలికం సర్కిల్స్ లో అందుబాటులో ఉన్నాయి. 

ఈ డేటా ఫ్రీ రీచార్జ్ ప్లాన్లతో మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి. 

  • రూ. 3,699 రీఛార్జ్ ప్లాన్‌లో డిస్నీ హాట్‌స్టార్ మొబైల్‌కి ఒక సంవత్సరం కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. 
  • రూ. 3,799 రీచార్జ్ ప్లాన్ తో Disney Hotstar మొబైల్ ఆఫర్‌తో పాటు Amazon Prime Lite సబ్‌స్క్రిప్షన్‌ కూడా వస్తుంది. 
  • దీంతోపాటు సూపర్ హీరో ప్రీపెయిడ్ ప్లాన్లను త్వరలో ఇతర టెలికాం సర్కిల్‌లకు తెలంగాణలో కూడా విస్తరించనున్నారు.