సింగరేణి వృత్తి శిక్షణ కేంద్రాలతో ఉపాధి : ​డి.అనిత

గోదావరిఖని, వెలుగు: సామాజిక, స్వయం ఉపాధి కల్పనలో భాగంగా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతులు, మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు 15 వృత్తి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సేవా ప్రెసిడెంట్​డి.అనిత తెలిపారు. బుధవారం ఆర్జీ 1 ఏరియా కమ్యూనిటీ హాల్​శిక్షణా కేంద్రాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టైలరింగ్, మగ్గం వర్క్స్, బ్యూటీషియన్, ఫ్యాషన్​డిజైనింగ్.. తదితర కోర్సుల్లో చేరి శిక్షణ పొందాలన్నారు. అనంతరం గతేడాది వృత్తి కోర్సుల్లో శిక్షణ పొందిన 365 మందికి సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌‌‌‌వోటూ జీఎం గోపాల్ సింగ్, పర్సనల్ డీజీఎం డి.కిరణ్ బాబు, అధికారుల సంఘం ప్రతినిధి శ్రావణ్ కుమార్, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్​ సెక్రటరీ ఎల్లయ్య, హన్మంతరావు, శిరీష, బీనా సింగ్ పాల్గొన్నారు.