ఇప్పుడు ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదు : వ్లాదిమిర్ పుతిన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ చాలా తెలివైన వాడని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నాడు. కజకిస్థాన్ లో నవంబర్ 28న జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ హాజరైయ్యాడు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికా ఎన్నికల ప్రచార తీరు తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ట్రంప్ కు రాజకీయంలో మంచి అనుభవం ఉందని, రాజకీయవేత్తని ప్రసంశల వర్షం కురిపించాడు. అయితే ఇప్పుడు ట్రంప్ సేఫ్ జోన్ లో ఉన్నాడని ఆయనకు నమ్మకం లేదని అన్నాడు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో రెండు సార్లు ట్రంప్ పై అటాక్ జరిగింది. జూలైలో పెన్సిల్వేనియా, సెప్టెంబరులో ఫ్లోరిడా గోల్ఫ్ కోర్స్‌లలో రెండు సార్లు జరిగిన హత్యాయత్నంలో డొనాల్డ్ ట్రంప్ గాయపడ్డారు. 

ట్రంప్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి ఉపయోగించిన పద్దతులు పూర్తిగా అనాగరిక మని పుతిన్ చెప్పాడు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సేఫ్ జోన్లో లేడని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్ జాగ్రత్తగా ఉంటాడని.. తన మాటలను అర్థం చేసుకుంటాడని భావిస్తున్నానన్నారు పుతిన్. అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కుటుంబం, పిల్లలను రాజకీయ ప్రత్యర్థులు ఎలా విమర్శించారనేది తనను తాను మరింత దిగ్భ్రాంతికి గురి చేసిందని పుతిన్ అన్నారు.