ఒక వ్యక్తి శరీరంలో ఎర్రరక్త కణాల నిర్మాణం, DNA సంశ్లేషణ వంటి కీలక శరీర క్రియలకు B12 చాలా అవసరం.. శరీరంలో B12 తగినంత మొత్తంలో లేనప్పుడు విటమిన్ బి12 లోపం లేర్పడుతుంది. B12ను కోబాలమిన్ అని కూడా అంటారు. ఇది నీటిలో కరిగే విటమిన్. ఇది వివిధ శారీరక విధుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ B12లోపం వల్ల వ్యక్తి ఆరోగ్యంపై కలిగి ప్రభావం, B12 స్థాయిలను పెంచేందుకు ఉపయోగపడే చిట్కాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
B12 లోపంతో వచ్చే అనర్థాలు.. ఆనారోగ్య సమస్యలు
1. అలసట, బలహీనత :శక్తి లేకపోవడం, నిత్యం అలసట వంటి లక్షణాలు B12 లక్షణాలు. ఇది రోజువారీ కార్యకలాపాలు, ఉత్పాదకత, మొత్తం జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది.
2.లేత లేదా పసుపు రంగు చర్మం:B12 లోపం ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో దగ్గుదలకు కారణమవుతుంది. ఇది రక్తహీనతకు దారి తీస్తుంది. రక్తహీనత ఉన్న వ్యక్తులు లేత లేదా పసుపు రంగు చర్మం కలిగి ఉంటారు. ఎందుకంటే ఎర్రరక్తకణాలు చర్మం ఆరోగ్యకరమైన రంగుకు దోహదం చేస్తాయి .
3. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు: విటమిన్ B12లోపంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి తగ్గడం వల్ల శరీరం యొక్క ఆక్సిజన్ వాహన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
4. మైకం, తలనొప్పి :B12 లోపం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వల్ల తలనొప్పి తరచుగా వస్తుంది.
5. గ్లోసిటిస్:గ్లోసిటిస్ అనేది నాలుక వాపు.ఇది B12 లోపం ప్రారంభ సంకేతం. ఇది నాలుక ఉబ్బి, మృదువుగా రంగు మారడానికి కారణమవుతుంది.
వీటితో పాటు B12 లోపం వల్ల జీర్ణ సమస్యలు, నరాల సమస్యలు, జ్తాపకశక్తి కోల్పోవడం, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, గుండె జబ్బులు వంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యలు ఎదురవుతాయి.
విటమిన్ 12 లోపాన్ని ఎలా అధిగమించాలి ?
విటమిన్ 12 లోపాన్ని అధిగమించేందుకు ఈ క్రింది ఆహార వినియోగం పెంచాలి.
1.మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, తృణధాన్యాలు, మొక్కల ఆధారిత పాలు వీటిలో విటమిన్ 12పుష్కలంగా ఉంటుంది.
2.డాక్టర్లను సంప్రదించి సప్లిమెంట్స్ ద్వారా కూడా B12 పొందవచ్చు.
3. కొందరిలో విటమిన్ B12 ను గ్రహించడంలో ఇబ్బంది పడవచ్చు. గట్ శోషణను దాటవేసే ఇంట్రానాసల్ స్ప్రేని వాడవచ్చు.
శాఖాహారులకు B12 పెంచే ఆహారం:
పుట్టగొడుగులు, బీట్ రూట్స్, బంగాళదుంప, యాపిల్, ఆరెంజ్, బ్లూ బెర్రీస్, బటర్ నట్ స్వ్కాష్,
విటమిన్ B12 పరిష్కరించడానికి డాక్టర్ సంప్రదించి రక్త పరీక్షల ద్వారా మీ B12 స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలి.