ఇదేం పద్దతి: విస్తారా ఎయిర్లైన్స్లో వింత ఫుడ్ లేబులింగ్..మండిపడుతున్న నెటిజన్లు

విస్తారా ఎయిర్ లైన్స్ వింత ఫుడ్ లేబులింగ్..ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది..విస్తారా విమానంలో ప్యాసింజర్లకు అందిస్తున్న భోజనం..హిందూ భోజనాలు, ముస్తిం భోజనాలు అని లేబుల్ వేయడం పట్ల కొందరు ప్యాసింజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్తి టికూ సింగ్ అనే జర్నలిస్టు విస్తారా విమానంలో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచు కుంటూ.. నిర్వా హకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జమ్మూ నుంచి కాశ్మీర్ కు విస్తారా విమానంలో ప్రయాణిస్తున్న ఆర్తి టికూసింగ్ రెండు భోజనాలను ఆర్డర్ చేసింది.ఒకటి వెజ్, మరొకటి నాన్ వెజ్.. అయితే తాను ఆర్డర్ చేసిన శాఖాహార భోజనంపై హిందూభోజనం అని.. చికెన్ వంటకాలను ముస్లిం భోజనం అని లేబుల్ చేసి ఇచ్చారు.. ధీంతో ఆర్తికి చిర్రెత్తుకొచ్చింది..  దీనికి సంబంధించిన ఆమె శ్రీగర్ నుంచి జమ్మూ కు టికెట్ ను స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేసింది. 

టికూ సోషల్ మీడియా ప్లాట్ ఫాం Xలో పోస్ట్ ను షేర్ చేస్తూ.. హిందువులందరూ శాఖాహారులని, ముస్లింలందరూ మాంసాహారులని ఎవరూ చెప్పారు.. ఆహార ఎంపికలను ప్రజలపై ఎందుకు రుద్దుతున్నారని. .. ఇలా చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారని రాసింది. ఈ విషయంపై నెటిజన్లు కొందరు ఎయిర్ లైన్స్ విధానాన్ని సమర్ధిస్తే.. కొందరు తప్పుబడుతూ పోస్ట్ లు పెట్టారు. 

ఎయిర్ క్రాప్ట్ మీల్ కోడ్ లను అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ (IATA) అందిస్తుంది. అన్ని ఎయిర్ లైన్స్ కు ఒకేవిధంగా ఉంటాయని కొందరు నెటిజన్లు చెప్పుకొచ్చారు. ఈ పదాలు సాధారణ విమానయాన పరిభాషలో ఉపయోగించబడ్డాయని మరో నెటిజన్ చెప్పుకొచ్చాడు.  అదే విషయమైన విస్తారా ఎయిర్ లైన్స్ కూడా టికూకు వివరణ ఇచ్చిందట.. అయితే టికూ మాత్రం అస్సలు ఒప్పుకోలేదట.