ప్రయోగం ఫలిస్తుందా: నేషనల్ అవార్డు డైరెక్టర్తో గోపీచంద్ కొత్త సినిమా!

ప్రస్తుతం హీరో గోపీచంద్ చేసే సినిమాల పరిస్థితి ఆడియన్స్ కి కిక్ ఇవ్వట్లేదు. వరుస సినిమాల్లో నటిస్తే సరిపోతుందా.. కథ, కథనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. వరుసగా రామబాణం, భీమా, విశ్వం సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. ఈ క్రమంలో భీమా కాస్తా పర్వాలేదనిపించిన ఆశించిన స్థాయిలో ఆడియన్స్ను ఆకట్టుకోలేకపోయింది. దాంతో గోపీచంద్ ఎంచుకునే కథల్లో దమ్ము ఉండటం లేదని అభిమానుల నుంచి బలంగా వినిపిస్తోంది.  

ఇదిలా ఉంటే..ఈ సారి గోపీచంద్ తన పంథా మర్చి విభిన్న కథలను ఎంచుకుంటున్నాడట. ఇందులో భాగంగానే ఇంట్రెస్టింగ్ డైరెక్టర్తో సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. 'ఘాజీ' దర్శకుడు సంకల్ప్ రెడ్డి చెప్పిన కథ గోపీచంద్కి బాగా నచ్చిందట. వెంటనే ఒకే చెప్పేసినట్లు సమాచారం. సంకల్ప్ రెడ్డి గత చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. వరుణ్ తేజ్తో అంతరిక్షం, ఆ తర్వాత 'ఐబీ-71' సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇక అప్పటి నుండి రెండేళ్లు ఖాళీగా ఉన్న సంకల్ప్.. గోపీచంద్ సినిమాతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడట. అందుకోసం ఈ కథ నేషనల్ లెవల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఘాజీ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్నారు డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. ఇపుడు నేషనల్ అవార్డు డైరెక్టర్తో గోపీచంద్ సినిమా ఎలాంటి ప్రయోగాల మధ్య వస్తుందో చూడాలి. త్వరలో ఈ కాంబోపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను చిత్తూరి శ్రీనివాస్ నిర్మించనున్నాడు. 

ALSO READ | Netflix Top Movies: నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్ రిలీజ్

అలాగే, జిల్,రాధేశ్యామ్ సినిమాలకు డైరెక్టర్గా పనిచేసిన రాధాకృష్ణ(Radhakrishna)తో  గోపీచంద్ ఓ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను బడా ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్ప‌టికే ఈ మూవీ స్టోరీ లైన్‌ ను విన్న హీరో గోపీ చంద్‌ కు కథ నచ్చేసిందట. త్వరలో ఈ సినిమాపై కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం డైరెక్టర్ రాధాకృష్ణ రాధేశ్యామ్ డిజాస్టర్ తర్వాత అయన కనిపించిన దాఖలాలు లేవు. ఆ మూవీ ఇచ్చిన ఫలితం వల్ల గట్టి కథను సెట్ చేసే పనిలో ఉన్నాడేమో  మరి. రాధేశ్యామ్ ను భారీ స్థాయిలో తెరకెక్కించిన ఎవ్వరికీ పెద్దగా కనెక్ట్ అవ్వాలి. సాంగ్స్, విజువల్స్ తప్ప సినిమా మోస్తరుగా ఆడింది. ఇక ఇప్పుడు గోపీచంద్తో తీయబోయే సినిమా ఎలా ఉండనుందో అంటూ మాచో ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. ఏదేమైనా గోపీచంద్ సాహసం చేయాల్సిందే.