Game Changer: గేమ్ ఛేంజర్ రివ్యూ ఇచ్చినందుకు.. మా ఇళ్లపై దాడులు చేస్తున్నారు : ఉమైర్ సంధు

ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని తనకు తాను చెప్పుకునే ఉమైర్ సంధు (Umair Sandhu) గురించి అందరికీ తెలిసిందే. ఇపుడు ఆయన గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇదే అంటూ X వేదికగా పోస్ట్ చేశాడు. ఇక ఈ రివ్యూ పూర్తిగా సినిమాకు వ్యతిరేఖంగా ఉంది.

"శంకర్ షణ్ముఖం 90 కాలం నాటి చెత్త పొలిటికల్ సినిమాలు చూసి విసిగిపోయాం. మొదట ఇండియన్ 2. ఇప్పుడు గేమ్ ఛేంజర్. మూవీ ఒక టార్చర్, రామ్ చరణ్, కమల్ హాసన ల కెరీర్ నాశనం చేశావ్. గేమ్ ఛేంజర్ పేలవమైన రచన. ఫ్లాప్ పాటలు, బోరింగ్ స్క్రీన్ ప్లే. ఈ చెత్త సినిమా కోసం రూ.500 కోట్లు ఖర్చు చేసినందుకు మేకర్స్ సిగ్గుపడాలి. రిటైర్ అయిపో శంకర్ అంటూ" ఉమైర్ సంధు వరుస ట్వీట్స్ చేస్తూ రెచ్చిపోయాడు.

దాంతో సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ సినిమాపై ఉమైర్ సంధు పెట్టిన పోస్టులకు రామ్ చరణ్ ఫ్యాన్స్ తిరగబడ్డారు. ఇతను పూర్తిగా ఫేమ్ కోసమే రివ్యూలు ఇస్తాడని.. మొన్నటికి మొన్న పుష్ప 2 పై కూడా ఇలానే ఇచ్చాడని.. ఇపుడు కొత్తగా గేమ్ ఛేంజర్ సినిమాపై కూడా ఇవ్వడం మన దురదృష్టం అంటూ చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే.. ఉమైర్ సంధు తాజగా మరొక కొత్త ట్వీట్ చేసాడు. "గేమ్ ఛేంజర్ సినిమాపై నెగిటివ్ రివ్యూలు ఇచ్చినందుకు పోలీసులు మరియు ప్రభుత్వ వ్యక్తులు ఆంధ్ర ప్రదేశ్‌లోని నా మామయ్య ఇంటిపై దాడి చేశారు" అంటూ పోస్ట్ పెట్టాడు.

అయితే ఇందులో ఎంత మాత్రం నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉమైర్ సంధు పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.