పచ్చి మిర్చీ హల్వా ఎలా తయారు చేయాలో తెలుసా?

హల్వా అంటేనే అందరికీ నోరూరుతుంది. భారతీయ వంటకాల్లోని ఈ తీపి అల్వాకు ప్రత్యేక మైన  గుర్తింపు ఉంది. క్యారెట్ హల్వా, బీట్ రూట్ హల్వా, కేసరి హల్వా, బాదం హల్వా వంటి రకరకాల హల్వాలను  చూశాం. అయితే ఈ హల్వాను ఒక్కో చోట ఒక్కో విధంగా తయారు చేస్తారు.  లేటెస్ట్ గా  గ్రీన్  మిర్చీ అల్వా బాగా వైరల్ అవుతోంది.  కేరళ  కాలికట్ లోని ఓ హోటల్  గ్రీన్  మిర్చీతో తయారు చేసిన హల్వా  ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

హల్వా ఎలా తయారు చేశారో వీడియో పోస్ట్ చేశారు. అందులో  ముందుగా   పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కోసి ఒక పెద్ద గిన్నెలో వేశారు. తర్వాత దీనికి సరపడా  చక్కెర,  ఆకుపచ్చ రంగు, పాలు, నెయ్యి, జీడిపప్పు  వేసి కలిపారు.  వీటిని బాగా ఉడికించిన తర్వాత  అల్వా రెడీ అయ్యింది. తర్వాత దీన్ని  చిన్న చిన్న బాక్సుల్లో ఆరబెట్టారు. ఈ వీడియోను ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ 5  పేరుతో ఇన్ స్టాలో షేర్ చేశారు. ఈ గ్రీన్ మిర్చీ హల్వా రూ.120 అని పెట్టారు.  ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షల మందికి పైగా  చూడగా..  15,500 లకు పైగా లైకులు వచ్చాయి.