వావ్​ : ఆఫర్​ అదిరింది..30 నిమిషాలు.. 6 ప్లేట్ల బిర్యానీ.. రూ. లక్ష గిఫ్ట్​

కోయం బత్తూరు  రైల్వేస్టేషనులో జనాలు ఎగబడ్డారు.  ప్రయాణికులతో కిక్కిరిసి ఉందనుకుంటున్నారా.. అయితే మీ ఆలోచన రాంగ్​.. బిర్యానీ తినడం కోసం ఎగబడ్డారట.. అదేంటి హోటల్​ కో .. రెస్టారెంట్​ కో వెళ్లాలి కదా.. మరి రైల్వే స్టేషన్​ లో బిర్యానీ తాకిడి ఏందనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీపై ఓలుక్కేయండి..

కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌లో బోచే ఫుడ్ ఎక్స్‌ప్రెస్ రైలు రెస్టారెంట్ ప్రారంభించారు.ఈ  రైలు రెస్టారెంట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ నిర్వహించింది. . రెస్టారెంట్ పాపులారిటీ కోసం కొత్త కొత్త  ఆఫర్లును ప్రకటించింది. ఈ ఆఫర్​ కోసం  బుధవారం  ( ఆగస్టు 28)  వందలాది మంది పాల్గొన్నారు. అయితే.. ఈ ఆఫర్​ ఎలా ఉందంటే.. 30 నిమిషాల్లో 6 ప్లేట్ల బిర్యానీ తినాలి. అలా తిన్న వారికి లక్ష రూపాయల బహుమతిని గెలుచుకోవచ్చని ఆ రెస్టారెంట్ ప్రకటించింది. 

ఈ ఆఫర్​  వార్త తెలియగానే రెస్టారెంట్ కు జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇందులో పలువురు పురుషులు, మహిళలు పాల్గొన్నారు. అయితే.. ఈపోటీలో పాల్గొనేందుకు చాలా మంది ఆసక్త చూపడంతో.. గురువారం  ( ఆటస్టు 29) ఉదయం వరకు పోటీ జరిగింది. ఈటింగ్ ఛాలెంజ్ పై రెస్టారెంట్ ఓనర్ మాట్లాడుతూ, “మేము బిర్యానీ పోటీని నిర్వహించాము. ఇందులో ఆరు ప్లేట్లు తిన్నవారికి లక్ష రూపాయలు గెలుచుకుంటారని.. మూడు ప్లేట్లు తిన్నవారికి 50,000 రూపాయలు ఇస్తాం” అని ప్రకటించామన్నారు. ప్రస్తుతం 400 మంది రిజిస్టర్ చేసుకున్నారని.. ఎక్కువ మంది వస్తున్నారని తెలిపారు.

ALSO READ | పిల్లలు బ్రేక్​ ఫాస్ట్​ తినడానికి మారం చేస్తున్నారా.. అయితే ఇవి ట్రై చేయండి...

ఈ పోటీలకు మంచి స్పందన వస్తుండటంతో భవిష్యత్తులో మరిన్ని పోటీలు నిర్వహిస్తామని యాజమాన్యం తెలిపింది. ఈ పోటీ కోసం 1,000 ప్లేట్ల బిర్యానీని తయారు చేశామని, కిచెన్ లో వర్కర్లు 24 గంటలు పని చేస్తూనే ఉన్నారని తెలిపారు. కాగా.. ప్రతి నెలా ఒక కొత్త పోటీని నిర్వహించాలని తాము ప్లాన్ చేస్తున్నామన్నారు. తర్వాత.. మసాలా దోస పోటీ ఉండవచ్చని యాజమాన్యం పేర్కొంది.