సింహాన్ని మృగరాజు అని ఊరికే అనలేదు. అడవిలో దాదాపుగా సింహాలదే ఆధిపత్యం ఉంటుంది. భారీ శరీరంతో, తీక్షణమైన చూపులతో సింహాలు వణుకు పుట్టిస్తాయి. ఫారెస్ట్ కింగ్ అయినా.. సరే మగసింహం .. ఆడసింహాన్ని చూస్తే తోక ముడవాల్సిందే.. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అడవి అంటేనే నిత్యం యుద్ధ వాతావరణంతో కూడుకుని ఉంటుంది.ఇక్కడ బతికి బట్ట కట్టాలంటే నిత్యం పోరాడుతూనే ఉండాలి.లేదంటే మాత్రం ఏ క్షణం అయినా ప్రాణాలు కోల్పోవచ్చు. కాబట్టి ఆ జంతువులు నిత్యం అలర్ట్ గానే ఉంటాయి.ఇక క్రూర జంతువుల విషయానికి వస్తే మాత్రం ఒక జంతువును చూస్తే ఇంకో జంతువు అస్సలు ఊరుకోదు. అప్పుడప్పుడు మగ సింహంపై ఆడ సింహం దారుణంగా దాడి చేస్తుంది.ఆడ సింహాలు కూడా మగ సింహాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఉంటాయి కాబట్టి వీటి పోరు అంత ప్రమాదకరంగా ఉంటుంది.ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒకటి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.దాన్ని చూసిన వారంతా కూడా షాక్ అయిపోతున్నారు.
జంతువులన్నీ కూడా అడవిలో ప్రతీ రోజూ జీవనమరణ పోరాటాన్ని సాగిస్తుంటాయి. క్రూర జంతువులకు దొరకకుండా చిన్న జంతువులు తప్పించుకుంటే.. వేటాడే సింహం, పులి, చిరుత, మొసలి నుంచి మరికొన్ని తప్పించుకుంటాయి. ఇదిలా ఉంటే.. అడవికి రారాజు సింహం.. దాని ఒక్క గర్జన చాలు.... మిగతా జంతువులు అన్ని కూడా దెబ్బకు భయపడి.. దడుసుకుంటాయి. అలాంటిది రారాజైన సింహం కూడా ఒకరిని చూస్తే భయపడిపోతుంది. మరి అదే ఎవరో కాదు ఆడ సింహం అండీ బాబూ..
వైరల్ వీడియో ప్రకారం.. రోడ్డుకు ఆనుకుని ఉన్న గొయ్యిలో అప్పటికే ఆడ సింహం ఎంచక్కా సేద తీరుతోంది. ఇక అప్పుడే వచ్చిన మగ సింహం.. అంతే.! ఇంకేముంది.. ఆ ఆడ సింహం.. గయ్యిమంటూ లేచి మగ సింహంపై శివాలెత్తింది. దానిపైకి దూకుతూ.. పరుగులు పెట్టించింది. తన పిల్లలకు ప్రమాదం వాటిల్లకుండా ఆడ సింహాలు అప్పుడప్పుడూ మగ సింహలతో గొడవపడతాయని అంటున్నారు. కాగా, ఈ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘అమేజింగ్ నేచర్’ అనే ట్విట్టర్ ఖాతా దీనిని ఇంటర్నెట్‌లో షేర్ చేయగా.. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు. ‘భార్యతో వాదిస్తే.. ఇలాగే ఉంటుంది’ అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘మనుషులకు కూడా ఇదే పరిస్థితి అని’ మరొకరు కామెంట్ చేశారు. మీరూ వీడియోపై ఓ లుక్కేయండి మరి.
Female lions will often fiercely defend their cubs from any potential threats, including male lions. pic.twitter.com/LROU1tSELT
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) April 10, 2024