గణేశ్​ శోభాయాత్ర అడ్డగింత

  • రోడ్డు పై బైఠాయించి పద్మశాలీల నిరసన

రాయికల్, వెలుగు: రాయికల్​ పట్టణంలో సోమవారం రాత్రి పద్మశాలి కులస్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర పోలీసుల చర్యతో వివాదానికి దారి తీసింది. డీజే పర్మిషన్​ లేదని శోభాయాత్రను అడ్డుకోవడంతో యువకులు, మహిళలు  ఆందోళనకు దిగారు.

  రెండు రోజులుగా  రాయికల్ లో వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతోందని, డీజేలతో శోభాయాత్ర నిర్వహించారని మహిళలు తెలిపారు.   పోలీసులు వారి యాత్రను అడ్డుకోవడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. యువకులు, మహిళలను స్థానిక ప్రజాప్రతినిధులు, పద్మశాలి సంఘం ప్రతినిధులు పోలీసులతో చర్చలు జరపడంతో ఎట్టకేలకు పోలీసులు డీజేకు అనుమతి ఇవ్వడంతో మళ్లీ  యాత్ర సాగింది.