బైబై గణేశా..!

  • ఉమ్మడి వరంగల్​జిల్లా వ్యాప్తంగా వైభవంగా గణేశ్​నిమజ్జనం

ఉమ్మడి వరంగల్​జిల్లాలో వైభవంగా వినాయక నిమజ్జనం సాగుతోంది. సోమవారం మధ్యాహ్నం నుంచే మండపాల నుంచి నిర్వాహకులు శోభాయాత్రలు ప్రారంభించారు. కోలాటాలు, భజనలు, బ్యాండ్ చప్పుళ్లతో యువత ఉర్రూతలూగారు. తీన్మార్​స్టెప్పులతో ఆకట్టుకున్నారు. రంగులు చల్లుకుంటూ ర్యాలీగా గణపయ్యను చెరువుల వద్దకు తీసుకువచ్చి గంగమ్మ ఒడికి చేర్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణేశ్‌‌ విగ్రహాల నిమజ్జనోత్సవం ప్రశాంతంగా సాగింది. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ఉత్సవ నిర్వాహకులు, యూత్​సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు గణపతి లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలకు చోటు లేకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.  - వెలుగు, నెట్​వర్క్​