వినాయకుడికి భక్షాల ప్రసాదాలు ఇవే..

వినాయకుడి నవరాత్రిళ్లు కొనసాగుతున్నాయి.    రోజుకు రెండు, మూడు రకాల ప్రసాదాలతో దేవుడ్ని పూజిస్తుంటారు భక్తులు. మన దగ్గర పులిహోర, ఉండ్రాళ్ల పాయసం, కుడుములు, కేసరి మొదలైనవి ఎలా ప్రసాదంగా పెడతామో... ఉత్తరభారతంలో మనం ఉగాది నాడు చేసుకునే భక్ష్యాలను ప్రసాదంగా చేస్తారు. అందులోనూ వివిధ రకాల భక్ష్యాలను పెడతారట. ఈ వినాయక  నవరాత్రుల్లో స్వామివారిప్రసాదాలను ఎలా తయారు చేస్తారో చూద్దాం. . .

పచ్చి కొబ్బరితో  ప్రసాదం తయారీకి కావాల్సినవి

  • గోధుమ లేదా మైదా పిండి :  ఒక కప్పు
  •  నెయ్యి: సరిపడా 
  • పచ్చికొబ్బరితురుము: ముప్పావు కప్పు
  •  ఇలాచీ పొడి :అరటీస్పూన్
  •  బెల్లం తురుము :ముప్పావు కప్పు
  •  పసుపు   చిటికెడు:  కావాలంటే

తయారీ విధానం: ఒక గిన్నెలో గోధుమ లేదా మైదా పిండి, -కొద్దిగా నెయ్యి, పసుపు, సరిపడా నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టాలి. మరోవైపు స్టవ్​ పై పాన్​   పెట్టి బెల్లం తురుము, పావు కప్పు నీళ్లు పోసి మరిగించాలి. తర్వాత ఇలాచీ పొడి పచ్చికొబ్బరి తురుము వేసి కలపాలి. మిశ్రమం దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకుని చపాతీలు మాదిరిగా తయారు చేసుకొని  మధ్యలో కొబ్బరి. మిశ్రమాన్ని పెట్టాలి. దాన్ని మళ్లీ ముద్దగా చేసి వత్తాలి. ఇలా పిండి మొత్తాన్నీ చేశాక. భక్ష్యాలను నెయ్యితో రెండువైపులా కాల్చాలి.

ఖర్జూరంతో ప్రసాదం తయారీకి కావలసినవి

  • గింజలు తీసిన ఖర్జూరం  : ఒక కప్పు
  • బెల్లం తురుము : రెండు టీ స్పూన్లు
  •  ఎండుకొబ్బరి తురుము  :పావు కప్పు
  • ఇలాచీ పొడి :పావు టీస్పూన్, 
  • ఉప్మారవ్వ : అర కప్పు
  • గోధుమ లేదా మైదా పిండి: పావు కప్పు
  • పసుపు  :చిటికెడు కావాలంటే 
  • నూనె లేదా నెయ్యి : సరిపడా

తయారీ విధానం: ఒక పెద్ద గిన్నెలో రవ్వ, పసుపు, గోధుమ లేదా మైదా పిండి వేయాలి. అందులో సరిపడా నీళ్లు పోసి ముద్దగా కలపాలి.  కొద్దిగా నూనె వేసి కలిపితే పిండి మృదువుగా వస్తుంది. ఆ పిండిని అరగంట సేపు పక్కన పెట్టాలి.. మరోవైపు గింజలు తీసిన ఖర్జూరాలను పావుగంటసేపు గోరువెచ్చని నీళ్లలో నానబెట్టి,ఆపైన మిక్సీలో గ్రైండ్ చేయాలి. స్టవ్​ పై పాన్​ పెట్టా  బెల్లం తురుము.. ఒక టీస్పూన్ నీళ్లు పోసి కలపాలి. ఊదు నిమిషాల తరువాత ఖర్జూరాల  ముద్ద,  ఎండుకొబ్బరి తురుము, ఇలాచీ పొడి వేసి మిశ్రమం దగ్గరికయ్యాక దింపేయాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకుని చపాతీల్లా వత్తి మధ్యలో ఖర్జూర మిశ్రమం పెట్టాలి. దాన్ని మళ్లీ ముద్దగా చేసి వత్తాలి. ఇలా పిండి ముత్తాన్నీ చేశాక భక్ష్యాలను నెయ్యి లేదా నూనెకో రెండువైపులా కాల్చాలి.

గుమ్మడికాయ తురుముతో ప్రసాదం తయారీకి కావలసినవి

  • గుమ్మడికాయ తురుము  :మూడు కప్పులు
  •  బెల్లం తురుము  :ఒకటిన్నర కప్పు
  •  గోధుమ లేదా మైదా పిండి :ముప్పావు కప్పు
  •  ఇలాచీ పొడి:  ఒక టీ స్పూన్ 
  • పసుపు:  చిటికెడు కావాలంటే

తయారీ విధానం :  స్టవ్​ పై పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేయాలి. అందులో గుమ్మడికాయ తురుము వేసి ఐదు నిమిషాలు వేగించాలి. తర్వాత బెల్లం తురుము వేసి కలపాలి. మిశ్రమం చిక్కగయ్యాక ఇలాచీ పొడి వేసి రెండు నిమిషాలు తరువాత  స్టవ్ ఆఫ్ చేసి దింపేయాలి.మరోవైపు ఒక గిన్నెలో పిండి.కొద్దిగా నెయ్యి, పసుపు, సరిపడానీళ్లు పోసి కలపాలి .ఆపిండినిఅరగంట సేపు నానబెట్టాలి.తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకుని చపాతీల్లా వత్తి మధ్యలోగుమ్మడికాయ మిశ్రమాన్ని పెట్టాలి.దాన్ని మళ్లీ ముద్దగా చేసి వత్తాలి.పిండి మొత్తాన్నీ చేశాక. భక్ష్యాలనుచెయ్యి వేసి రెండువైపులా కాల్చాలి.

రవ్వ ప్రసాదం తయారీకి కావలసినవి

  • గోధుమ లేదా మైదా పిండి :రెండున్నర కప్పులు 
  • చక్కెర లేదా బెల్లం తురుము  : రెండు కప్పులు. 
  • నెయ్యి  : సరిపడా
  •  ఉప్మారవ్వ :  ఒక కప్పు
  •  ఫుడ్ కలర్ : కొద్దిగా

తయారీ విధానం :  గిన్నెలో గోధుమ పిండి, సరిపడా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. తర్వాత స్టవ్​ పై పాన్​ పెట్టి  నెయ్యి వేడి చేయాలి అందులో ఉప్మారవ్వను దోరగా వేగించాలి. అడుగు మందంగా ఉన్న ఇంకో గిన్నెలో 3 కప్పుల నీళ్లు పోసి స్టవ్ పై పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు వేగించిన రవ్వ వేసి కలపాలి.  అది బాగా ఉడికాక చక్కెర లేదా బెల్లం తురుము, ఫుడ్ కలర్ వేసి కలపాలి. మిశ్రమం చిక్కగయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. దాన్ని చల్లారేవరకు ఫ్యాన్ కింద పెట్టాలి. తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకుని వత్తి, మధ్యలో కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని పెట్టాలి. మళ్లీ దాన్ని గుండ్రంగా చేసి, చపాతీలా వత్తాలి. మొత్తం పిండినంతా ఇలా చేశాక, వాటిని నెయ్యితో రెండువైపులా కాల్చాలి..