- మంత్రి సీతక్కను కోరిన వినయ్ రెడ్డి
నందిపేట, వెలుగు: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో అసంపూర్తిగా ఉన్న పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.
మండలంలోని కౌల్‌పూర్ గ్రామంలో ఎస్సీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పొడిగింపునకు రూ. 50 లక్షలు, మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న గౌడ ఫంక్షన్‌హాల్ నిర్మాణ పనులకు రూ. 25 లక్షలు, పద్మశాలీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు రూ. 25 లక్షలు, మైనార్టీ ఫంక్షన్‌హాల్‌కు రూ. 25 లక్షలు మంజూరు చేయాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని త్వరలోనే నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు వినయ్ రెడ్డి తెలిపారు.