లింగంపేట మండలంలో ఘనంగా ఎడ్లబండ్ల ప్రదర్శన

లింగంపేట, వెలుగు : లింగంపేట మండలంలోని కోమట్​పల్లి గ్రామస్తులు శనివారం దుర్గమ్మ దేవతకు ఎడ్లబండ్ల ప్రదర్శన చేపట్టారు. ఎడ్ల బండ్లను రంగులతో,రంగురంగుల చీరలతో అలంకరించి  ప్రదర్శన చేపట్టారు. ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి పూజలు చేశారు.  

ఏటా మృగశిర కార్తె నుంచి మూడు రోజుల పాటు దుర్గమ్మ ఉత్సవాలను గ్రామస్తులు ఆనవాయితీగా నిర్వహిస్తారు. మొదటి రోజు ఎడ్లబండ్ల ప్రదర్శన,రెండవరోజు బోనాల ఊరే గింపు, కుస్తీపోటీలను నిర్వహిస్తారు.