హూజుర్ నగర్, వెలుగు : మిషన్ భగీరథ పైప్ పగిలిపోవడంతో తాగునీళ్లు రావడం లేదని హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామస్తులు మండిప్డడారు. మంగళవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో 15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని వాపోయారు.
సత్తెమ్మ తల్లి గుడి ఎదురుగా పైపులైను పగలడంతో నీళ్లన్నీ వృథాగా పోతున్నాయన్నారు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి పైప్‌లైన్‌కు రిపేర్ చేయాలని కోరారు.