వేములవాడలో రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్లుల్లో అధికారుల తనిఖీలు 

వేములవాడరూరల్​, వెలుగు: వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని చెరువు శిఖం భూముల్లో రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్లులు నిర్మించారని గ్రామస్తులు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు మేరకు వివిధ శాఖల అధికారులు మంగళవారం తనిఖీ చేపట్టారు. మల్లయ్యకుంట చెరువును పూడ్చి మారుతి, మహాలక్ష్మి మిల్లులు నిర్మించారని, వాటి నుంచి వ్యర్థాలతో పంట పొలాలు దెబ్బతింటున్నాయని, మిల్లుల నుంచి వచ్చే దుర్వాసనతో కేజీబీవీలో చదువుకునే స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవస్థలు పడుతున్నారని రైతులు, గ్రామస్తులు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు.

రైస్​మిల్లుల డాక్యుమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొల్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఈటీపీ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తదితరాలను చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. నివేదికను కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందజేస్తామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారతి, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈడీ స్వప్న, పీసీబీ ఆఫీసర్​ జ్యోతి, రూలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తహసీల్దర్ సుజాత, టౌన్ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్సారీ, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీఈ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.