భద్రాచలం ఏఎస్పీగా విక్రాంత్​ కుమార్​ సింగ్

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం ఏఎస్పీగా విక్రాంత్​కుమార్​ సింగ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 2022 ఐపీఎస్​ బ్యాచ్​కు చెందిన ఆయన ఉత్తరప్రదేశ్​లోని గజియాబాద్​కు చెందిన వారు. ఐపీఎస్​గా ఎంపికైన అనంతరం జాతీయ పోలీసు అకాడమీలో ట్రైనింగ్​ తీసుకున్న విక్రాంత్​ గతేడాది జనవరి 8న భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ప్రొబిషనరీ విధులు నిర్వర్తించేందుకు వచ్చారు. 

మార్చి 4 నుంచి మే 25 వరకు కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లి పోలీస్​స్టేషన్​లో ఎస్​హెచ్వోగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత జూన్​లో జాతీయ పోలీస్​ అకాడమీకి వెళ్లిపోయారు. ట్రైనింగ్​ తర్వాత గ్రేహౌండ్స్​లో పనిచేశాక తాజాగా భద్రాచలం ఏఎస్పీగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.