స్టూడెంట్స్​కు అపార్ కార్డు తప్పనిసరి : డీఈవో వెంకటేశ్వరాచారి

ఇల్లెందు, వెలుగు : స్టూడెంట్స్​తప్పనిసరిగా అపార్ కార్డు జనరేట్ చేయాలని డీఈవో వెంకటేశ్వరాచారి తెలిపారు. బుధవారం సుభాష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల పరిధిలోని అన్ని ప్రైవేట్, గవర్నమెంట్ స్కూళ్ల హెచ్ఎం, ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్, వెల్ఫేర్ పాఠశాలలు విద్యార్థులకు అపార్​జనరేట్​చేయడంలో వెనుకబడి ఉన్నాయన్నారు. ఏవైనా టెక్నికల్ సమస్యలు ఉంటే వెంటనే మండలంలోని స్ట్రాంగ్ టీచర్లను, ఎంఐఎస్ లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కో-ఆర్డినేటర్ సతీశ్ కుమార్, ఎంఈవో స్వామి తదితరులు పాల్గొన్నారు.