'వికటకవి' (Vikkatakavi)- ది క్రానికల్స్ ఆఫ్ అమరగిరి నవంబర్ 23న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2024లో వరల్డ్ ప్రీమియర్‌ను ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమం నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరుగనుంది. ఇది 1970ల తెలంగాణా నేపథ్యంలో తెరకెక్కిన తెలుగు ఒరిజినల్ సిరీస్ కావడం విశేషం.
అలాగే హిందీ నుండి స్టార్ హీరో మనోజ్ భాజ్ పాయ్ నటించిన 'డిస్పాచ్' వెబ్ సిరీస్ కూడా IFFIలో ప్రదర్శించనున్నారు. అయితే, రిలీజ్కు ముందే ఈ వెబ్ సిరీస్‌లను ఇంటర్నేషనల్ వేదికపై ప్రదర్శిస్తుండటంతో ఆడియన్స్లో అంచనాలు పెరిగాయి. దాంతో ఈ సిరీస్‌ల కథ ఎలాంటిదో తెలుసుకోవాలని ఆడియన్స్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. మరి ఆ కథ కథనాల వివరాలేంటో ఓ లుక్కేద్దాం.
నరేష్ అగస్త్య (Naresh Agastya), మేఘా ఆకాష్ (Megha Akash) కీలక పాత్రల్లో నటించిన డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ 'వికటకవి' (Vikkatakavi). ఈ వెబ్ సిరీస్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. ఫస్ట్ టైమ్ ఓ డిటెక్టివ్ వెబ్‌సిరీస్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వస్తుండటంతో ఆడియన్స్లో అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు రిలీజ్ కు ముందే (IFFI) వేదికపై స్పెషల్ షో పడనుండటంతో క్యూరియాసిటీ రెట్టింపు అయింది.
Also Read : సమంతతో నటించే అవకాశం కెరీర్‌లో మర్చిపోలేను
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో వికటకవి వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్కి రాబోతుంది. ఈ సిరీస్కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. నవంబర్ 28న 'వికటకవి' వెబ్‌సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సీరీస్ ఆడియన్స్ ఊహకు అందని ట్విస్ట్‌లతో, తెలంగాణ యాస, భాషలతో సాగనున్నట్లు సమాచారం.
#Vikkatakavi, the latest Zee5 original directed by @PradeepMaddali to be released on 28th November, is all set to be screened at the prestigious @IFFIGoa International Film Festival of India - 2024 ?@nareshagastya @akash_megha @pradeepmaddali @Zee5global @itsRamTalluri pic.twitter.com/rsMuejYWKj
— ZEE5 Telugu (@ZEE5Telugu) November 18, 2024
వికటకవి స్టోరీ లైన్::
ఇప్పటికీ తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ, పీరియాడిక్ జోనర్లో వస్తోన్న థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక స్టోరీ విషయానికి వస్తే..హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని 'అమరగిరి' అనే ప్రాంతాన్ని 30 ఏళ్లుగా ఏదో శక్తి రూపంలో ఉండే ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. దాంతో ఆ గ్రామాల చుట్టూరా ఉన్న ప్రజల్లో ఏదో తెలియని భయం వెంటాడుతుంటుంది. ఇక ఈ ప్రాంతంలో ఉన్న భయాన్ని, అక్కడ నెలకొన్న సమస్యను సాల్వ్ చేయడానికి డిటెక్టివ్ రామకృష్ణ ఆ ఊరికి వెళతాడు. ఇక తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేసి అమరగిరి ప్రాంతాన్ని భయపెట్టేది.. కనబడని శక్తి హ ? లేక ముసుగువేసుకున్న మనుషులా? అక్కడ ఉన్న రహస్యాలను వెలికితీసే క్రమంలో ఎదురయ్యే సవాళ్లేంటీ ? అసలు మేఘ ఆకాష్ ఎవరు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
డిస్పాచ్ కథ:
మనోజ్ బాజ్‌పేయి, షహానా గోస్వా, అర్చిత అగర్వాల్ కీ రోల్స్లో నటించిన లేటెస్ట్ వెబ్ సీరిస్ 'డిస్పాచ్'. కను బెహ్ల్ డైరెక్ట్ చేసిన ఈ సీరీస్ లో మనోజ్ బాజ్‌పేయి క్రైమ్ జర్నలిస్ట్ పాత్రలో నటించాడు. అయితే, ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. అధికారం, నైతికత, వ్యక్తిగత సంఘర్షణల వలయంలో చిక్కుకున్న ఓ జర్నలిస్ట్ జర్నీ తో ముడిపెట్టి క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ఇది జీ 5లో స్ట్రీమింగ్కు రానుంది.