ఖమ్మంలో ఏడాదిగా తెరుచుకోని విజయ డెయిరీ షాపింగ్ కాంప్లెక్స్

ఖమ్మం ఫొటోగ్రాఫర్, వెలుగు : ఖమ్మం నగరంలోని రోటరినగర్ లో ఉన్న విజయ మిల్క్ డైయిరీ ప్రాంగణంలో రోడ్డు పక్కనే కొత్తగా ఏర్పాటు చేసిన కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ షెట్టర్లు ఏడాదిగా మూసే ఉన్నాయి. లక్షలాది రూపాయలతో నిర్మించిన షాపులు అద్దెను కోల్పోతూ నిరుపయోగంగా మారాయి. ఈ విషయమై డెయిరీ డీడీ మురళి మోహన్ ను వివరణ కోరగా కాంప్లెక్స్ లను అద్దెకు ఇచ్చేందుకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పిన్ నెంబర్ కోసం దరఖాస్తు చేశామని తెలిపారు.

కాంప్లెక్స్ కు ఎదురుగా నిర్మించిన బస్ షెల్టర్ ను కూడా తొలగించాలని ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇవి క్లియర్ కాగానే ఆర్డీవోతో కూడిన కమిటీ ద్వారా అద్దెలకు టెండర్లు పిలుస్తామన్నారు.