పోటీ గెలవాలని.. 69 ఏళ్ళ విజయ్ పోరాటం

టైటిల్ : విజయ్​ 69

ప్లాట్​ ఫాం : నెట్​ఫ్లిక్స్​

డైరెక్షన్ : అక్షయ్ రాయ్

కాస్ట్ : అనుపమ్ ఖేర్, చుంకీ పాండే, మిహిర్ అహుజా

లాంగ్వేజ్: హిందీ

ఈ కథ 69 ఏళ్ల విజయ్ మాథ్యూ ( అనుపమ్ ఖేర్) చుట్టూ తిరుగుతుంది. అతను ఒకప్పుడు అథ్లెట్​. కానీ.. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భార్య కోసం కెరీర్​ని త్యాగం చేస్తాడు. కానీ.. విజయ్​కి 69 ఏండ్లు వచ్చాక మళ్లీ ఏదైనా సాధించాలి అనే ఆలోచన వస్తుంది. దాంతో ట్రయాథ్లాన్​లో పార్టిసిపేట్​ చేసి, గెలవాలి అనుకుంటాడు. పోటీ ఏంటంటే.. 1.5 కి.మీ. స్విమ్మింగ్, 40 కి.మీ సైక్లింగ్, 10 కి.మీ లాంగ్​ రన్​ వెంట వెంటనే పూర్తి చేయాలి. 

అందులో గెలిస్తే.. ఆ పోటీని గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డ్​ క్రియేట్​ చేయొచ్చు అనుకుంటాడు. కానీ.. అతన్ని చూసి అందరూ ఎగతాళి చేస్తారు. తన ప్రాణ స్నేహితుడు ఫాలి (చుంకీ పాండే) మాత్రం విజయ్​కి తోడుగా నిలబడతాడు. దాంతో విజయ్​ పోటీలో దిగుతాడు. ఈ క్రమంలో అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? పోటీలో గెలిచాడా? లేదా? సినిమా చూసి తెలుసుకోవాలి.