అద్భుతం: అంతరిక్ష కేంద్రం నుంచి ఉరుములతో తుఫాను దృశ్యాలు

మనం సాధారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాన్ దృశ్యాలను మనం భూమిమీద నుంచే అప్పుడప్పుడు చూస్తుంటాం.. ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి కదా.. అయితే ఈ ఉరుములు, మెరుపులతో కూడిన థండర్ స్టార్మ్ లను మనం అంతరిక్ష కేంద్రం నుంచి చూస్తే ఎలా ఉంటుంది.. ఈ వీడియోలో మనం ఆ అద్భుత దృశ్యాలను చూద్దాం.. 

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వచ్చిన వీడియోలో మెరుస్తున్న సిటీ లైట్లు అలాగే భూమి ఉపరితలం నుంచి మైళ్ల నుంచి అనేక ఉరుములతో కూడిన తుఫానులు దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో వ్యోమగామి పాలో నెస్పోలీ తీశారు. ఆఫ్రికా నుంచి రష్యా వరకు భూమిని చూపుతుంది. నెస్పోలి తెలిపిన దాని ప్రకారం..ఇటలీని తాకిన అనేక తుఫానులు కూడా ఈ వీడియోలో చూడవచ్చు.