వేములవాడలో రోడ్డు విస్తరణ పనులు ఆపాలి .. ఆర్డీవోకు బాధితుల వినతి

వేములవాడ, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయ మెయిన్​ రోడ్​ వెడల్పు పనులు ఆపాలని బాధితులు డిమాండ్​ చేశారు. మంగళవారం మున్సిపల్  ఆఫీస్​లో వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్  అధ్యక్షతన మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రధాన రహదారిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే ప్రధాన పత్రికల్లో నోటిఫికేషన్  కూడా ఇచ్చామని, ఇందులో భాగంగానే నిర్వాసితుల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు.

అభిప్రాయాలు, సలహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇదిలాఉంటే పట్టణంలోని రహదారి విస్తరణలో స్థలం కోల్పోతున్న నిర్వాసితులు, మున్సిపల్  కార్యాలయానికి చేరుకున్న వ్యాపారులు రోడ్డు విస్తరణకు అభ్యంతరం తెలిపారు. విస్తరణ పనులను నిలిపివేయాలని ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్  చైర్ పర్సన్  రామతీర్థపు మాధవి, వైస్  చైర్మన్  బింగి మహేశ్, కమిషనర్  సంపత్ రెడ్డి, తహసీల్దార్​ మహేశ్ కుమార్, టీపీవో అన్సార్  పాల్గొన్నారు.