ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వెటర్నరీ అసోసియేషన్​ కార్యవర్గం ఎన్నిక : సౌడయ్య యాదవ్

లింగంపేట, వెలుగు: వెటర్నరీ మెడికల్​ అసోసియేషన్  నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల​ కార్యవర్గాన్నిఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు సౌడయ్య యాదవ్​ తెలిపారు. అధ్యక్షుడిగా మహిపాల్​రెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా రాజేశ్వర్​రావు, గౌరవ సలహాదారుడిగా మంచాల జ్ఞానేందర్, ప్రధాన కార్యదర్శిగా రావుల గౌతమ్, ఉపాధ్యక్షుడిగా వెంకట్​రావు, ట్రెజరర్​గా రాము, ప్రచార కార్యదర్శిగా బాలయ్య, సభ్యులుగా రాజు, సోఫియాన్, గంగారాం, అశోక్, చంద్రశేఖర్, రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో అసోసియేషన్​ రాష్ట్ర గౌరవ సలహాదారుడు రామారావు, రాష్ట్ర కోశాధికారి రవీందర్​రెడ్డి, ఈసీ మెంబర్​ వరప్రసాద్​ తదితరులు పాల్గొన్నారు.