మామిడిపల్లిలో చక్రస్నానంతో ముగిసిన పుష్కర బ్రహ్మోత్సవాలు

మాక్లూర్, వెలుగు: మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి శివారులో తొమ్మిదిరోజులుగా జరిగిన శ్రీ అపురూప వేంకటేశ్వరస్వామి పుష్కర బ్రహోత్సవాలు గురువారంతో ముగిశాయి.  చివరి రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 6 గంటల వరకు కొనసాగాయి.  

శాంతి పాఠము, వేదాది విన్నపములు, ద్వార తోరణ, ధ్వజ కుంభ, మూర్తి కుంభ ఆరాధనలు,  నివేదన, చక్రస్నానం జరిపించారు.  కార్యక్రమంలో అమృతలతా రెడ్డి, నరేందర్‌‌ రెడ్డి, నెల్లుట్ల రమాదేవి, లలితా దేవి,  ప్రభాదేవి తదితరులు, ఆలయ ధర్మ కర్తలు,భక్తులు పాల్గొన్నారు.