ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

బీర్కూర్, వెలుగు : మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వరస్వామి నవమ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. మంగళవారం చివరి రోజు కావడంతో శ్రీలక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వరస్వామికి అర్చకులు అభిషేకాలు, చక్రస్నానం చేయించారు. తెల్లవారుజామున స్వామివారికి నూతన పట్టువస్త్రాలు

మంగళ హారతులు ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఆలయ ధర్మకర్త, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి- దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.