చొప్పదండిలో ఘనంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

చొప్పదండి, వెలుగు:  పట్టణంలోని వేంకటేశ్వర మణికంఠ ఆలయంలో శ్రావణ మాసంలో నిర్వహించే శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి వార్షిక కల్యాణ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో   ప్రధాన అర్చకులు పోలోఝు చరణాచార్యులు    కల్యాణోత్సవం నిర్వహించారు.  

భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బొడిగె వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి చేపూరి సత్యనారాయణ, ట్రెజర దండె సత్యానందం, భక్తులు పాల్గొన్నారు.