కిక్కిరిసిన రాజన్న టెంపుల్

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం రాత్రి నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు 50 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున నుంచే  తలనీలాలు, కోడెల మొక్కులకు క్యూ లైన్ కట్టారు. స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. బాలత్రిపురదేవి అమ్మవారి వద్ద కుంకుమ పూజ చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తులు బ్రేక్​ దర్శనాన్ని వినియోగించుకోగా.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.