రాజన్న హుండీ ఆదాయం రూ. కోటి 82 లక్షలు

  • 150 గ్రాముల బంగారం, 14 కిలోల 700 గ్రాముల వెండి

వేములవాడ, వెలుగు : దక్షిణకాశీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఖజానాకు భారీగా హుండీ ఆదాయం సమకూరింది. గత 30 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ ఓపెన్ స్లాబ్​లో ఆలయ ఈవో వినోద్​రెడ్డి పర్యవేక్షణలో ఎస్పీఎఫ్​ సిబ్బంది బందోబస్తు మధ్య గురువారం లెక్కించారు.

ఈ సందర్భంగా స్వామివారి ఖజానాకు రూ.1 కోటి 82 లక్షల 33 వేల 710 నగదు, 150 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం, 14 కిలోల 700 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈ లెక్కింపులో ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఏఈఓలు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, శివరామకృష్ణ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.