నెల్లికుదురులో ఘనంగా వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

నెల్లికుదురు, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం నెల్లికుదురు గెస్ట్ హౌస్ లో మహబూబాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏదళ్ల యాదవ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేం నరేందర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మన ప్రాంతంలో పుట్టి, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి సలహాదారుగా ఎదగడం గర్వకారణమన్నారు. 

అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మండలాధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, హెచ్ వెంకటేశ్వర్లు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.