సీఎం రేవంత్ రెడ్డి వెంట నడుద్దాం : పిడమర్తి రవి

మహబూబాబాద్ అర్బన్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి వెంట నడుద్దామని, ఎస్సీ వర్గీకరణ సాధిద్దామని మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పిడమర్తి రవి అన్నారు. బుధవారం ఆయన మహబూబాబాద్ ఆర్అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో మాట్లాడారు. పార్లమెంట్​లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి మాదిగలకు న్యాయం చేస్తానని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో మాదిగల ఓటు బ్యాంకు కోసం ప్రకటనలు చేశారని ఆరోపించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు కార్యచరణ సిద్ధం చేస్తూ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘం వేశారని తెలిపారు. సమావేశంలో మాదిగ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.