సంజయ్‌‌‌‌‌‌‌‌.. సిరిసిల్ల కార్మికుల పట్ల మీ విజన్‌‌‌‌‌‌‌‌ ఏంటీ..?

  • వెలిచాల రాజేందర్‌‌‌‌‌‌‌‌రావు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ సిటీ, వెలుగు: సిరిసిల్ల చేనేత కార్మికుల సంక్షేమంపై బండి సంజయ్​ విజన్ ఏంటో చెప్పాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. బుధవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ ఉత్తుత్తి వినతి పత్రాలతో ఇంకా ఎన్ని రోజులు మభ్యపెడతారని ప్రశ్నించారు.

ప్రధాని మోదీ తన నియోజకవర్గమైన వారణాసిలోని చేనేత కార్మికుల సంక్షేమం కోసం రూ.10 కోట్లతో నిఫ్ట్‌‌‌‌‌‌‌‌(నేషనల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఫ్యాషన్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ) ఎక్స్‌‌‌‌‌‌‌‌టెన్షన్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయించుకున్నారని తెలిపారు. అదే మాదిరిగా సిరిసిల్లలో రూ.10 కోట్లతో నిఫ్ట్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌టెన్షన్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయించే దమ్ముందా అని బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించారు.

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ హయాంలో సిరిసిల్లకు మంజూరైన మెగా క్లస్టర్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌కు తరలిపోతే కల్లప్పగించి చూసింది మీరు కాదా.. అని విమర్శించారు. అనంతరం పట్టణంలోని పలు వినాయక విగ్రహాలను సందర్శించారు.