జమ్మూ కాశ్మీర్ లోయలో పడ్డ వాహనం..ఐదుగురు చిన్నారులతో సహా 8మంది మృతి

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంత్ నాగ్ సమీపంలో ఓ వాహనం లోయలోపడింది.  ఈ ప్రమాదంలో 8మంది చనిపోయారు. మృతుల్లో ఐదు గురు చిన్నారులున్నారు. అనంత్ నాగ్ జిల్లాలో దక్సమ్ ప్రాంతాలో శనివారం  జూలై 27, 2024న వాహనంలో లోయలోపడింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు , ఇంకా ఎవరైనా ప్రమాదంలో గాయపడ్డారా పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.