Good Health : కూరగాయలను పసుపు నీళ్లతో కడిగి వాడుకోవాలి.. అలా చేస్తేనే ఆరోగ్యం

మార్కెట్ లో కనిపించే కూరగాయలన్నీ శుభ్రమైనవి కావని మీకు తెలుసా? వాటి పైన ఎన్నో రకాల పెస్టిసైడ్స్, రసాయనాలు చల్లుతారు. అందుకే కాయగూరలని, పండ్లను శుభ్రంగా కడిగిన తరువాతే తినాలి. పండ్లు, కాయగూరల మీద చేరిన పెస్టిసైడ్స్ పూర్తిగా పోవాలంటే బేకింగ్ సోడా బాగా పనిచేస్తుంది. ఒక బకెటి నీళ్లలో నాలుగు బేకింగ్ సోడా వేసి కాయగూరలు, పండ్లు అందులో వేసి పావుగంట ఉంచితే రసాయనాలు తొలగిపోతాయి. 

పసుపుతో కూడా కాయగూరలు, పండ్లలోని క్రిములను నాశనం చేయొచ్చు. పసుపు వేసిన నీళ్లలో పండ్లను, కాయగూరలను కాసేపు ఉంచితే వాటిమీద ఉన్న క్రిమిసంహారక మందులు అన్నీ నశించిపోతాయి. 

ఇక వీటితో పాటు పండ్లు, కూరగాయల మీద చేరిన క్రిములు, బ్యాక్టీరియాలను వెనిగర్, ఉప్పు కూడా నాశనం చేస్తాయి.. ఒక బకెట్లో కొంచెం నీళ్లు తీసుకుని అందులో వైట్ వెనిగర్ లేదా ఉప్పు వేసి, పండ్లు, కూరగాయలు వేసి ఐదు నిమిషాలు ఉంచి, తరువాత మంచినీళ్లతో కడిగితే చాలు కూరగాయలు, పండ్లపై ఉన్న క్రిములన్నీ నశిస్తాయి. ఇలా శుభ్రం చేసుకుని తింటేనే పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు వీలుంటుంది.