హిందువులు..చాలా ఆచారాలను పాటిస్తారు. ఇంటిని కట్టాలన్నా.. ఉన్న ఇంటిని రెండు పోర్షన్లుగా విభజించాలన్నా వాస్తు సిద్దాంతాలను పాటించాలి. ఇలా రెండు పోర్షన్ లుగా విడగొట్టినప్పుడు ఫేసింగ్ ఎటు ఉండాలి.. టాయిలెట్స్ ఏ దిక్కున ఉండాలో చూద్దాం..
వేరువేరు పోర్టన్లు కాబట్టి టాయిలెట్స్ కూడా వేరువేరుగానే ఉండాలి. ఒకవేళ సాధ్యంకాకపోతే రెండింటికి కలిపి ఒక టాయిలెట్ కట్టుకోవచ్చు. ఉన్న ఇంటికి కొంత గ్యాప్ ఇచ్చి కట్టుకోవాలి. వాయువ్యం, ఆగ్నేయం మాత్రమే టాయిలెట్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
ఊళ్లలో చాలామంది పొలాల్లో ఇల్లు కట్టుకుంటారు. అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ఊరవతల పొలంలో ఇల్లు కట్టుకుంటే.. దానికి దగ్గరలోనే రోడ్డు ఉంటుంది కదా... అయితే ఆ ఇంటి కంటే రోడ్డు ఎత్తులో ఉంటే సమస్యలు ఉంటాయా ... పొలంలో కట్టుకునే ఇల్లు ఎలా ఉండాలి..
ఇల్లు ఎక్కడ కట్టుకున్న వాస్తు ప్రకారమే ఉండాలని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ చెబుతున్నారు. అయితే తూర్పు, ఉత్తరం వైపు ఎత్తు ఎక్కువగా ఉంటే కచ్చితంగా మార్పులు చేసుకోవాలి. దక్షిణం, పడమర వైపు ఇల్లు కట్టుకున్నట్లయితే, వాస్తు ప్రకారం ఉన్నట్లే... ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే వాస్తు నిపుణులను సంప్రదించాలి..
Also Read : డిసెంబర్ 15 నుంచి ఈ 5 రాశుల వారికి దివ్యమైన మంచి యోగం అంట..!
ఇక వాటర్ ట్యాంక్ ను నిర్మించుకొనేటప్పుడు.. ఇంటి మీద వాటర్ ట్యాంకు కట్టుకోవచ్చు. దానివల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే చాలామంది. నైరుతి దిక్కులో బరువు ఉండాలని వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది అంత మంచిది కాదు. బరువు నైరుతిలోనే ఉండాలి. కానీ నీళ్లు ఉండకూడదు. అందుకని నార్త్ సెంటర్ లేదా వెస్ట్ సెంటర్లో ట్యాంకు కట్టుకోవాలి.
ఇంకా ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు.. వారి వారసులు.. అంటే కుమారులు.. కోడళ్లు.. కర్మకాండలు అయిన తరువాత తప్పని దేవాలయంలో నిద్ర చేయాలని చెబుతుంటారు. గుడి నిద్ర ఎందుకు? అలా చేయడం తప్పనిసరా? ఇలా ఎందుకు చేయాలి.. చేయకపోతే ఏమవుతుంది.. ఇలాంటి ప్రశ్నలకు కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం. .
ఇది వాస్తుకు సంబంధించింది కాదు.. ఇంట్లోవాళ్లు ఎవరైనా చనిపోతే కచ్చితంగా గుడి దగ్గర నిద్ర పోవాలి. ఇది హిందువుల నమ్మకం. పెద్దల ఆచారం కూడా. మొదట అత్తగారింట్లో... ఆ తర్వాత ఏదైనా గుడి దగ్గర ఒక రాత్రి నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల ఇంటిపై చెడు ప్రభావం పడదు. చనిపోయినవాళ్ల ఆత్మ శాంతిస్తుందని కొందరి నమ్మకం..
-కాశీనాథుని శ్రీనివాస్, వాస్తుకన్సల్టెంట్, ఫోన్: 9440088799-