Vastu Tips: అపార్ట్ మెంట్‌లో ఏ ఫ్లోర్ అయితే బెటర్, ఇంట్లో అన్ని ద్వారాలు ఒకేలా ఉండాలా.. అలాంటి స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చా..?

ఏ ఫ్లోర్‌లో అయితే బెటర్..? 

నేను అపార్జ్‌మెంట్‌లో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నా. అపార్జ్‌మెంట్‌లో మొత్తం ఆరు ఫోర్లు ఉన్నాయి. ఫేసింగ్ ఉత్తరం వైపు ఉంది. ఏ ఫ్లోర్‌లో ఉండే ప్లాట్ తీసుకుంటే మంచిది. (సత్యనారాయణ, కరీంనగర్)

సమాధానం: ఏ ఫ్లోర్‌లో ఉన్నా వచ్చే ఇబ్బందులు ఏమీ ఉందపు ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు. వాళ్ల సౌకర్యాలను బట్టి ఇంటిని తీసుకుంటారు. ఫలానా ఫ్లోర్‌లోనే ఉంచాలనేఉండాలనే నియమం ఏమీ లేదు. పై ఫ్లోర్ అయితే ఎండ, వాన, చలికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సీనియర్ నెటిజన్స్ ఉంటే కునుక గ్రౌండ్ ఫ్లోర్ మంచిది. ఇంటికి ఎలాగైతే వాస్తు ఉంటుందో, అపార్జ్‌మెంట్‌‌కు కూడా వాస్తు ఉంటుంది. దాన్ని ప్రకారం ఏ ఇల్లు కలిసి వస్తుందో తెలుసుకొని ఇంటిని కొనండి.

అన్ని ద్వారాలు ఒకేలా ఉండాలా..?

నేను ఇల్లు కట్టుకోవడానికి ప్రాడ్ చేసుకుంటున్నా. ఇంటి సింహద్వారం ఎత్తుగా కట్టుకొని, మిగతా ద్వారాలు భిన్నగా కట్టుకోవచ్చా? దాని వల్ల ఏవైనా సమస్యలు వస్తాయా..? (వినయ్ రెడ్డి, హైదరాబాద్)

సమాధానం: ఇంటి మొత్తానికి ఒకే సైజు ద్వారాలు ఉంటే మంచిది. సింహద్వారం ఎత్తుగా ఉండి మిగిలిన ద్వారాలు తక్కువ ఎత్తులో ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే సింహద్వారం 8 ఫీట్లు ఉంటే, మిగతావి 6.9 ఫీట్లు ఉండాలి. ఏడు ఫీట్లు మాత్రం అస్సలు ఉండకూడదు.

అలాంటి స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చా..?

 మేం ముగ్గురం అన్నదమ్ములం. ఈ మధ్యే ఆస్థి పంపకాలు జరిగాయి. నాకు మా పూర్వీకుల పాత ఇల్లు వాటాగా వచ్చింది. ఆ ఇల్లు రోడ్డు పక్కన దక్షిణం దిశలో ఉంది. ఆ ఇంటిని కూల్చేసి కొత్త ఇంటిని కట్టుకోవాలనుకుంటున్నా.. అలా చేయచ్చా? (రవికుమార్, నల్లగొండ)

సమాధానం: ఇల్లు పూర్తిగా పడగొట్టి కొత్తగా ఇల్లు కట్టుకోవచ్చు. దాని వల్ల ఇబ్బందులు ఉండవు. దక్షిణ దిశలో ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. ఫేసింగ్‌ను బట్టి కట్టుకుంటే బాగుంటుంది.వాస్తు కన్సల్టెంట్ ను సంప్రదించి, సలహాలు, సూచనలు తీసుకోండి.

అడవికి దగ్గరగా ఉంటే ..?

నేను ప్రభుత్వ ఉద్యోగిని. రెండేళ్ల క్రితం మారుమూల గ్రామానికి బదిలీ అయ్యా. ఆ ఊరు అడవిని ఆనుకోని ఉంటుంది. గుట్టలు, రాళ్లు కూడా ఉంటాయి. అక్కడ సొంతిల్లు కట్టుకోవచ్చా..? ఒకవేళ కట్టుకుంటే, ఎలాంటి జాగత్తలు తీసుకోవాలి.(నాగరాజు, ఆదిలాబాద్)

సమాధానం: గుట్టలు, అడవుల దగ్గర ఇల్లు కట్టుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉండవు. ఇప్పుడు చాలా మంది ఊళ్లకు దూరంగా ఇల్లు కట్టుకుంటున్నారు. అడవి కాబట్టి సరైన జాగ్త్రత్తలు తీసుకుంటే మంచిది. కిచెన్, బెడ్ రూం, బాత్ రూం, హాల్ వాస్తు ప్రకారం ఉండేలా చూసుకోండి.

కాశీనాథుని శ్రేనివాస్ (వాస్తు కన్సల్టెంట్, 9440088799)