సిరిసిల్ల నేతన్నల కోసం ఓన్ బ్రాండ్

  •     వస్త్ర వ్యాపారులతో సమావేశంలో కాంగ్రెస్ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెలిచాల 

 రాజన్నసిరిసిల్ల,వెలుగు: సిరిసిల్ల యువ నేతన్నల కోసం ఓన్ బ్రాండ్ ‘వస్త్ర విహార్’ పేరిట షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు అన్నారు. శుక్రవారం సిరిసిల్లలో వస్త్ర వ్యాపారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు మాట్లాడుతూ  సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతానన్నారు. 

ఆ సమావేశంలో పలు విషయాలు చర్చించి  ఫైనల్ ఐడియాస్ తో ప్రపోజల్ కాపీ రెడీ చేసి సీఎంకు అందజేస్తామన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఓన్ బ్రాండ్ వస్త్ర విహార్ పేరుతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో రూ.100 కోట్లతో వ్యాపారాన్ని ప్రారంభించేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామన్నారు. తమిళనాడు తరహాలో టీషర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బనియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గార్మెంట్ తయారీ కోసం ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందేలా కృషి చేస్తామన్నారు.