ఈ సంవత్సరం ( 2024) చైత్ర నవరాత్రులు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమవుతాయి. ఇవి ఏప్రిల్ 17న రామ నవమి రోజుతో ముగుస్తాయి.. ఈ సమయంలో మాతృమూర్తి వివిధ రూపాలను భక్తితో పూజించడం ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. జీవితంలోని అన్ని కష్టాలను తొలగించి ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందని చెబుతారు. చైత్ర నవరాత్రి 9 రోజులు భగవతీ దేవి 9 రూపాలను పూజిస్తారు. చైత్ర నవరాత్రులు హిందువుల దేవత అయిన దుర్గా మాతను ఆరాధిస్తారు. తొమ్మిది రోజుల పండుగలో ప్రతి రోజు ఒక ప్రత్యేకమైన రంగుతో ముడిపడి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. దుర్గా మాతా తొమ్మిది రూపాలలో ప్రతి ఒక్కటి వేర్వేరు రంగులతో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు, ఇది శుభప్రదమైనదని పండితులు చెబుతున్నారు.
ఏప్రిల్ 9 (మంగళవారం): నవరాత్రుల మొదటి రోజు అంటే ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 6.25 నుంచి 10.27 వరకు ఘటస్థాపనకు ఉత్తమ సమయం. అంతే కాకుండా మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.48 గంటల వరకు ప్రారంభమయ్యే అభిజీత్ ముహూర్తంలో కూడా ఘటస్థాపన చేయవచ్చు.ఈరోజున మాతా శైలపుత్రిని పూజిస్తారు. అమ్మవారికి ఎరుపు రంగు బట్టలు కట్టాలి. ఎరుపు రంగు శక్తిని, ప్రేమను సూచిస్తుంది. ప్రతి సంవత్సరం మాతా రాణి ఏదో వాహనంపై స్వర్గం నుంచి భూలోకానికి వస్తుంటారు. ఈ సంవత్సరం మాత రాణి అశ్వాన్ని ఎక్కి భూలోకానికి రానుంది. ఇది శుభం కాదు. మాత రాణి గుర్రంపై స్వారీ చేయడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని అంటున్నారు.
ఏప్రిల్ 10 (బుధవారం): వసంత నవరాత్రిళ్లలో రెండో రోజు బ్రహ్మచారిణి మాతను పూజిస్తారు. బ్రహ్మచారిణి అవతారంలో ఉన్న అమ్మవారికిని నీలం అంటే చాలా ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. బ్లూ రంగు వస్త్రాలతో అలంకరించి... పూజలు చేయాలి. ఈ రంగు గొప్పతనాన్ని సూచిస్తుంది. శాంతి సందేశం ఇస్తూ అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తారని పండితులు చెబుతున్నారు.
ఏప్రిల్ 11 (గురువారం): వసంత నవరాత్రిళ్లలో మూడవ రోజు గౌరీదేవిని పూజిస్తారు. గౌరీ మాతకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం. పసుపు రంగుతో అంలకరించి చంద్రఘంటా దేవిని పూజిస్తారు. పసుపు రంగు శాంతిని ప్రశాంతతను సూచిస్తుంది.
ఏప్రిల్ 12 (శుక్రవారం): ఉగాది సందర్భంగా నిర్వహించే నవరాత్రి మహోత్సవాల్లో నాలుగవరోజు కూష్మాండాదేవిని పూజిస్తారు. కూష్మాండ మాతకు ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. ప్రకృతికి ప్రతీకగా .. సంతానోత్పత్తి.. శాంతి .. ప్రశాంతత ... భావాలతో ఆకుపచ్చ రంగు ముడిపడి ఉంటుంది.
ఏప్రిల్ 13 (శనివారం): వసంత నవరాత్రి ఉత్సవాల్లో ఐదవ రోజున నాగ్ పూజ చేస్తారు. స్కంద మాతను పూజిస్తూ... బూడిదరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. స్కంద మాతను పూజించేటప్పుడు అమ్మవారికి ఎదురుగా బూడిద గుమ్మడికాయను ఉంచి అమ్మవారిని ఆవాహన చేస్తారు. షోడసోపచార పూజలు నిర్వహించి...ధూప ..దీప.. నైవేద్యాలు సమర్పించిన తరువాత ఆ గుమ్మడికాను ఇంటి ముందు ఉట్టిలో పెట్టి గుమ్మం ముందు కడతారు. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అమ్మవారు కుటుంబానికి రక్షగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ఏప్రిల్ 14 (ఆదివారం): ఆదివారం అమ్మవారికి.. ఎంతో ప్రీతికరమైన రోజు... దుష్ట శక్తులు దరి చేరకుండా ఆదివారం పూజలు జరుపుతుంటారు. కాత్యాయనాయ విద్మహే... కన్యకుమారి ధీమహి తన్మో దుర్గి ప్రచోదయాత్ అంటారు. కాత్యాయనీ మాతకు నారింజ రంగు అంటే చాలా ఇష్టం. నారింజ రంగు అంటే పుల్లని పదార్దాలు.. అందుకే అమ్మవారికి నిమ్మకాయల దండ వేస్తారు. వసంత నవరాత్రి సమయాల్లో ఆరవరోజున కాత్యాయనీ అమ్మవారిని పూజించడం వలన శక్తి ప్రతిధ్వనించి.. ఉల్లాసంగా గడుపుతారు.
ఏప్రిల్ 15 (సోమవారం) మహా సప్తమి: వసంత నవరాత్రిళ్ల సమయంలో ఏడవ రోజు మాతా కాళరాత్రి దేవిని పూజిస్తారు. కాళరాత్రి దేవిని పూజించిన వారు అకాల మరణాన్ని ఎదుర్కోరు. అమ్మవారి ఈ రూపం భక్తులను మరణం నుండి రక్షిస్తుంది. మాతా కాలరాత్రి తన భక్తులను వారి విజయం కోసం కోపాన్ని ఉపయోగించమని ప్రేరేపిస్తుంది. మాతా కాలరాత్రి ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంత పరిచేందుకు తెల్లటి వస్త్రాలు కట్టి పూజలు జరపాలని పురాణాలు చెబుతున్నాయి.
ఏప్రిల్ 16 (మంగళవారం): ఈ రోజు వసంత నవరాత్రిళ్ల సమయంలోలో ఎనిమిదవ రోజు. ఈ రోజున మహాగౌరి రూపాన్ని పూజిస్తారు. మహాగౌరీ అమ్మవారికి పింక్ కలర్ అంటే మహా ప్రీతి. ఈ రోజున మహాగౌరిని పూజించడం చాలా పవిత్రమైనదిగా మారుతుంది. అష్టమి తిథి ఎనిమిదవ రోజు వస్తుంది. మహా గౌరీ రూపంలో దుర్గామాత చిత్రాన్ని పూజించడం ద్వారా జీవితంలోని దు:ఖాలు మరియు కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. హిందూ పురాణాల ప్రకారం తనను పూజించే భక్తుల అన్ని కోరికలనూ ఈ అమ్మవారు తీర్చగలదు. జీవితంలోని కష్టాలన్నిటినీ ఈ అమ్మవారి ఉపాసన ద్వారా దూరం చేసుకోవచ్చు అని భక్తుల విశ్వాసం.
ఏప్రిల్ 17 (బుధవారం) శ్రీరామ రామ నవమి : చైత్ర మాసంలో వసంత నవరాత్రిళ్లు జరుపుకుంటారు. చివరి రోజు.. తొమ్మిదవ రోజు ప్రతి పల్లె శోభామయానంగా రూపుదిద్దుకుంటుంది. చివరి రోజు శ్రీరామనవమి... శ్రీరాచంద్రుడు.. సీతాదేవి కళ్యాణం జరుపుతారు. పానకం.. వడపప్పు ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ రోజు ( ఏప్రిల్ 17) దైవత్వ దేవత సిద్ది రాత్రిని జరుపుకుంటారు. లోక కళ్యాణం కోసం ఆ రోజు రామనామాన్ని జపిస్తారు.