MATKA: తిరుమల శ్రీవారి సేవలో మట్కా టీం.. వరుణ్ తేజ్ ఆశలన్నీ పలాస డైరెక్టర్ పైనే!

తిరుమల శ్రీవారిని మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) దర్శించుకున్నారు. ఆయనతోపాటు మట్కా (MATKA) మూవీ టీమ్ సభ్యులందరూ స్వామివారి సేవలో పాల్గొన్నారు. మట్కా మూవీ రేపు గురువారం (నవంబర్ 13న) రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మూవీ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

పలాస మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కరుణకుమార్ (Karuna Kumar) డైరక్ట్ చేసిన ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. టీజర్, ట్రైలర్ విజువల్స్ సినిమాపై మరింత హైప్ పెంచేసాయి. మనం ఆశను నమ్ముతం.. నమ్మకాన్ని కొంటాం'.. 'యేలు తీసుకుని వదిలేయడానికి నేను ద్రోణాచార్యని కాదు.. బాసుని .. మట్కా కింగ్ ని' అంటూ హీరో వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్స్ సినిమాపై ఇంటెన్స్ పెంచుతున్నాయి.

ఈ మూవీ కథ విషయానికి వస్తే.. 24 ఏళ్ళ టైమ్ పిరియాడ్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. 1958-1982 మధ్య జరిగిన యావత్ దేశాన్ని కదిలించిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నరట.

ALSO READ |ఇరవై ఏళ్ల తర్వాత కూడా మాట్లాడుకునేలా ఉంటుంది : కరుణ కుమార్

ఇదిలా ఉండగా.. ఈ మధ్య వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రాలు బాక్సఫెస్ వద్ద డిజాస్టర్గా నిలిచాయి. దీంతో మట్కా చిత్రంతో హిట్ కొట్టాలని బాగానే శ్రమించాడు. మరి ఈ చిత్రం థియేటర్లో ఆడియన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. కరుణకుమార్ తెరకెక్కించిన ఈమూవీలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ఫీమేల్ లీడ్ చేస్తున్నారు.