Super Food : మిరియాల అన్నం.. కొర్రల పలావ్.. కాలీఫ్లవర్ రైస్.. అబ్బబ్బ ఇంట్లో టేస్టీగా ఇలా తయారు చేసుకోండి..!

వేడివేడి అన్నంలో ఏ కూర కలుపుకుని తిన్నా రుచిగా ఉన్నట్టే... అన్నంలో రకరకాల పదార్థాలు వేసి చేసే ఏ ఫ్రైడ్ రైస్ అయినా బాగుంటుంది. బయటికి వెళ్లినప్పుడు ఆకలేస్తే... చాలామంది ప్రిఫర్ చేసేది ఫ్రైడ్ రైస్ నే. అలాంటి ఫ్రైడ్ రైస్​ను ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్లకుండా, ఇంట్లోనే చేసుకుని టేస్ట్ చేయాలంటే.. ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం. . .

కొర్రల పలావ్​ తయారీకి కావాల్సినవి

  • కొర్రలు... అరకప్పు 
  • గుడ్లు.. మూడు కావాలనుకుంటే)
  •  ఉల్లిగడ్డ తరుగు... పావు కప్పు 
  • టొమాటో తరుగు.... ఒక టేబుల్ స్పూన్
  •  పచ్చిమిర్చి తరుగు... ఒక టీ స్పూన్
  •  వెల్లుల్లి తరుగు ...అర టీ స్పూన్ 
  • క్యారెట్ తరుగు... ఒక టేబుల్ స్పూన్
  •  అల్లం తరుగు ..అరటీ స్పూన్ 
  • నూనె ...సరిపడా 
  • కారం... రుచికి సరిపడా 
  • ఉప్పు: తగినంత

తయారీ విధానం : కొర్రలను శుభ్రంగా కడిగి రెండు గంటలు నానబెట్టాలి. కొర్రల్లో రెండు కప్పుల నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్లో మూడు విజళ్లు వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత స్టవ్​ పై పాన్​ పెట్టి  నూనె వేడి చేయాలి. అందులో అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి క్యారెట్, టొమాటో తరుగు, ఉప్పు, కారం వేసి వేగించాలి. తర్వాత గుడ్లు కొట్టి వేయాలి .రెండు నిమిషాల తర్వాత మిశ్ర మాన్ని బాగా కలపాలి. చివరగా కొత్తిమీద తరుగు వేసి దింపేయాలి

షెజ్​ వాన్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావలసినవి

  • షెజ్​ వాన్​ సాస్​ ... మూడు టేబుల్ స్పూను
  •  వెల్లుల్లి తరుగు ... ఒక టీ స్పూన్
  •  ఆకుకూరల తరుగు ... రెండు టేబుల్ స్పూన్లు (ఏ ఆకులైనా సరే) కూరగాయల తరుగు (పుట్టగొడుగులు. బీన్స్, క్యారెట్, మొక్కజొన్న గింజలు. వచ్చి బఠాణీలు లాంటివి) - అన్నీ కలిపి.. ఒక కప్పు 
  • పనీర్ ముక్కలు.. పావు కప్పు( కావాలంటే) 
  • వండిన అన్నం ...రెండు కప్పులు 
  • సోయా సాస్: ఒక టేబుల్ స్పూన్
  •  ఉప్పు... తగినంత
  • మిరియాల పొడి.. రుచికి సరిపడా
  •  ఉల్లికాడ తరుగు.. ఒక టీ స్పూన్
  • సువ్వులు ....పావు టీ స్పూన్ (కావాలంటే)

తయారీ విధానం: స్టవ్ పై పానె పెట్టి నూనె వేడి చేయాలి... అందులో ఆకుకూరల తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేగించాలి. నిమిషం తర్వాత కూరగాయల తరుగు, కొద్దిగా ఉప్పు, పనీర్ ముక్కలు వేయాలి. మూడు నిమిషాలు పెద్ద మంటపై వేగించాలి. అందులో షెజ్ వాన్ సాస్, సోయా సాస్, మిరియాల పొడి వేయాలి. తర్వాత అన్నం వేసి కలపాలి. మళ్లీ పై నుంచి పాస్ లు చల్లి రెండు నిమిషాలు వేగించాలి. చివరగా నువ్వులు. ఉల్లికాడ తరుగు వేస్తే సూపర్​ షెజ్​ వాన్​ రైస్​ సిద్దం.

ALSO READ : Good Health: మొక్కజొన్న తింటే ఎంత లాభమో తెలుసా

మిరియాల అన్నం తయారీకి కావలసినవి

  • అన్నం.... ఒక కప్పు
  •  నల్ల మిరియాల పొడి ...ఒక టీ స్పూన్
  • అల్లం తరుగు..... అర టీ స్పూన్
  •  వెలుల్లి తరుగు - ...టీ స్పూన్
  • కరివేపాకు: ఒక రెమ్మ
  • క్యాప్సికం తరుగు... పావు కప్పు (కావాలంటే)
  •  నూనె .....సరిపడ
  • ఉల్లిగడ్డ తరుగు.... పావు కప్పు 
  • శెనగపప్పు...- ఒక టీ స్పూన్ 
  • గరం మసాలా ...పావు టీస్పూన్
  • కారం... చిటికెడు ఉప్పు తగినంత
  • కొత్తిమీర తరుగు: పావు కప్పు
  •  నిమ్మరసం... ఒక టీ స్పూన్

తయారీ విధానం: స్టవ్​ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో శెనగపప్పు, అల్లం, వెల్లులి.. క్యాప్సికం, ఉల్లిగడ్డ తరుగు వేసి. కలపాలి. కరివేపాకు, ఉప్పు, కారం వేసి మరోసారి కలపాలి. అన్నం. ..నల్ల మిరియాల పొడి కూడా వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత గరం మసాలా, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేస్తే చాలు.. రుచికరమైన మిరియాల అన్నం రెడీ

కాలీఫ్లవర్​ రైస్​ తయారీకి కావలసినవి

  • కాలీఫ్లవర్​ ముక్కలు .. రెండు కప్పులు
  • బియ్యం.... రెండు కప్పులు
  • ఉడికించిన ఐరాణీలు....అరకప్పు
  •  పచ్చిమిర్చి తరుగు..... అర టీ స్పూన్
  • కారం.... కొద్దిగా 
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్: ఒక టీ స్పూన్ 
  • పసుపు.... చిటికెడు
  • గరంమసాలా....అర టీ స్పూన్
  •  కొత్తిమీర తరుగు... పావు కప్పు

తయారీ విధానం : బియ్యాన్ని పొడిపొడిగా ఉడికించి పక్కన పెట్టాలి.ఉప్పు, పసుపు వేసి కాలీఫ్లవర్ ముక్కలను ముదురు ఎరుపు రంగు వచ్చే వరకు వేగించాలి. తరువాత కాలీఫ్లవర్​ ముక్కలు, అన్నం, గరం మసాలా, ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు ఉంచి... చివరిగా కొత్తిమీర తరుగు వేస్తే కమ్మని కాలీఫ్లవర్​ రైస్​ రడీ. . .

 -–వెలుగు.. లైఫ్​‌–