శ్రావణ శుక్రవారం:  వరలక్ష్మి వ్రతం  గురించి స్కందపురాణంలో ఏముందో తెలుసా..

శ్రావణ మాసం అనగానే గుర్తొచ్చేది వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratham). ఈ సారి ఆగస్ట్ 16వ తేదీన వరలక్ష్మీ వ్రతం వచ్చింది. ఏటా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం.. లేదంటే రెండో శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratham) చేస్తుంటారు.స్కంద పురాణంలో వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratham) గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించారు . ఈ  వ్రతాన్ని మహిళలు చేస్తే ఆయురారోగ్యం.. అష్టైశ్వరం సిద్ధిస్తోందని పురాణాలు చెబుతున్నాయి. 

 ముత్తైదువులు నియమ, నిష్టతో పూజ చేస్తుంటారు. అమ్మ.. తమను కరుణించు అని వేడుకుంటారు. చల్లగా చూడు తల్లి అంటూ.. తమ మాంగళ్యాన్ని కాపాడాలని కోలుస్తారు. శ్రావణ మాసంలో వచ్చే మిగిలిన శుక్రవారాల్లో కూడా కొందరు పూజ చేసుకుంటారు. వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratham) రోజున పనికి రాని మహిళలు.. ఆ రోజుల్లో పసుపు, కుంకుమ ఇస్తుంటారు.

కలశాన్ని స్థాపించాలి

వరలక్ష్మి వ్రతం (Varalakshmi  vratam) రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేస్తారు. కొత్త బట్టలు.. లేదంటే ఉతికిన బట్టలను ధరిస్తారు. ఉపవాస దీక్ష ప్రారంభిస్తారు. ఇంటిని శుభ్రం చేసుకుని.. పూజ గదిలో కలశాన్ని సిద్ధం చేసుకుంటారు. కలశాన్ని జాకెట్ బట్టతో అలంకరించాలి. పసుపు, కుంకుమ, గంధం కలిపిన మిశ్రమంతో స్వస్తిక్ చిహ్నాం వేయాలి. కలశంలో బియ్యం, నీరు, నాణేలు, 5 తమలపాకులను నింపాలి. పైన మామిడి ఆకులను ఉంచాలి. కొబ్బరికాయకు పసుపు రాసి దానిపై ఉంచాలి. ఐదు రకాల పండ్లు, నైవేద్యం సమర్పించాలి. వ్రతం చేసిన రోజు సాయంత్రం హారతి ఇవ్వాల్సి ఉంటుంది. ఓం హ్రీం శ్రీం లక్ష్మీభయో నమ: అనే మంత్రాన్ని జపించడం వల్ల కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. భాగస్వామి, కుటుంబం ఆయువు పెరుగుతుందని వివరించారు.

శివుడు ఇలా వివరించారు

స్కంద పురాణంలో వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratham) గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించారు. శ్రావణ మాసంలో రెండో శుక్రవారం.. లేదంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. కుండినం అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ ఇల్లాలు ఉండేదని ఆ శివుడు వివరిస్తారు. భర్త పట్ల ప్రేమ, అత్తమామల పట్ల గౌరవం ప్రకటిస్తూ.. ఉత్తమ ఇల్లాలుగా చారుమతి ఉండేది. మహాలక్ష్మీ దేవికి త్రివకరణ శుద్దితో పూజ చేస్తుండేది. ఆమెకు వరమహాలక్ష్మీ కలలో కనిపించిందని చెబుతారు. శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను కొలిచిన వారి కోరికలను తీరుస్తానని చెప్పిందట. అలా చేయడంతో చారుమతి సకల సిరి సంపదలను పొందిందట. అప్పటి నుంచి మహిళలు వ్రతాన్ని ఆచరించి.. వరమహాలక్ష్మీ అనుగ్రహం పొందాలని అనుకుంటున్నారు. అలా అప్పటినుంచి మహిళలు వ్రతం ఆచరించి.. ఉత్తమ ఫలితాలను పొందుతున్నారు. లక్ష్మీదేవి సాక్షాత్తు నారాయణుడి సతీమణీ కాగా.. మహిళలకు ఉత్తమ ఫలితాల కోసం ఏం చేయాలని శివుడిని పార్వతీదేవి అడగగా ఇలా తెలియజేశారు.

వరలక్ష్మీదేవి మంత్రం 

 

  • నమ: కమలవానిన్యై నారాయణ్యై నమో నమ:
  • కృష్ణప్రియాయై సతతం, మహాలక్షై నమో నమ:
  • పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమ:
  • పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యైచ నమో నమ:
  • సర్వసంపత్స్యరూపిణ్యై సర్వారాధ్యై నమో నమ:
  • హరిభక్తిప్రదాత్రై నమో నమ:

మంత్రం చదివే ముందు వరలక్ష్మీ దేవి చిత్ర పటం ముందు దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి నిష్టతో మంత్రాన్ని 11 సార్లు జపించాలి. తర్వాత కొబ్బరికాయ కొట్టి వరలక్ష్మీ దేవికి నమస్కారం చేసుకోవాలి. భర్త నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి. మంత్రం చదవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తోందని పండితులు చెబుతున్నారు.