సింగరేణిలో దొంగలు..!

  • చోరీకి గురవుతున్న విలువైన బొగ్గు, మెషినరీ, స్క్రాప్​
  • నిల్వ చేసిన స్క్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను​కూడా ఎత్తుకెళ్తున్నరు
  • సెక్యూరిటీ, కాపలా సిబ్బంది ఉన్నా ఆగని దొంగతనాలు
  • ఉద్యోగుల సహకారంతోనే చోరీలు జరుగుతున్నట్లు అనుమానాలు

గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో విలువైన బొగ్గు, మెషినరీకి సామగ్రి, స్క్రాప్​ చోరీకి గురవుతోంది. బొగ్గు గనులు, ఓపెన్​ కాస్ట్​ ప్రాజెక్ట్​లపై నిత్యం మూడు షిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో సంస్థకు చెందిన ఎస్అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీ, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు కాపలాగా ఉన్నప్పటికీ చోరీల పర్వం ఆగడం లేదు. వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి.

 ఇటీవల ఆర్జీ1 ఏరియా జీడీకే 1వ గని నుంచి 500 రూప్​ బోల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎత్తుకెళ్తుండగా ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీ ఆఫీసర్లు, సిబ్బంది పట్టుకున్నారు. ఇలా వరుస చోరీల వెనుక సంస్థలోని కొందరు ఉద్యోగుల హస్తం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి ఉన్నతాధికారులు సంస్థలో జరుగుతున్న చోరీ ఘటనలపై విచారణ జరిపించి అసలు దొంగలను పట్టుకోవాలని కార్మికులు, ఉద్యోగులు డిమాండ్​ చేస్తున్నారు.

కేసులు పెడుతున్నా చోరీలు ఆగడం లేదు

సింగరేణిలో బొగ్గు, స్క్రాప్​ చోరీలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆఫీసర్లు చెబుతున్నా.. వరుస ఘటనలు కలవరపెడుతున్నాయి. గతంలో రామగుండంలో పనిచేసిన ఓ పోలీస్​ ఆఫీసర్​ బొగ్గు, స్క్రాప్​ చోరీ దందాలపై నిఘా పెట్టి బాధ్యులైన వారిపై పీడీ కేసు పెట్టి జైలుకు పంపించారు. కాగా తాజాగా ఈ చోరీల దందా మళ్లీ మొదలైనట్లు అధికారులు చెబుతున్నారు.

 ఒక్క గోదావరిఖని ప్రాంతంలోనే సుమారు 30 వరకు స్క్రాప్​ కొనుగోలు దుకాణాలు ఉండడం గమనార్హం. ఇళ్లలో వృథాగా మారిన ఇనుము, ప్లాస్టిక్​ సామాగ్రిని కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నా.. ఈ స్క్రాప్​ దుకాణాల్లో కొంతమంది సింగరేణి స్క్రాప్​ను కొని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న ప్రచారం ఉంది. అయితే కొందరు సింగరేణి ఆఫీసర్లు వీరిని ప్రోత్సహిస్తుండడం వల్లే సింగరేణి స్క్రాప్​ చోరీకి గురవుతున్నట్లు ఆరోపణలున్నాయి. 

ఇటుక బట్టీలకు చోరీ బొగ్గు 

ఓసీపీ 1 పరిధిలోని సైలో బంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి, ఓసీపీ 3 సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ నుంచి ఎన్టీపీసీకి వ్యాగన్ల ద్వారా బొగ్గు సప్లై అవుతుంది. దారి మధ్యలో గూడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైలు నిలిచిపోతే.. గుర్తుతెలియని వ్యక్తులు పైకెక్కి బొగ్గును కింద పడేస్తుంటారు. ఇలా కింద పడ్డ బొగ్గును సేకరించి ఒక్కచోట కుప్పగా పోసి వాహనాలతో తరలిస్తున్నారు. ఈ బొగ్గు రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్​, ఇతర ప్రాంతాల్లోని ఇటుక బట్టీలకు చేరుతోంది. రాత్రికి రాత్రే చిన్న వాహనాల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. 

ఇటీవల చెట్ల పొదల్లో దాచి ఉంచిన 4.1టన్నుల బొగ్గును ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీ సిబ్బంది పట్టుకున్నారు. బొగ్గు తరలిస్తుండగా మధ్యలో ఎవరైనా పట్టుకుంటే అక్కడే వాహనాన్ని వదిలేసి పారిపోతున్నారు. ఒకవేళ బట్టీలకు తరలించాక పట్టుబడితే ఇతర రాష్ట్రాలనుంచి బొగ్గు తెచ్చుకున్నట్టు రశీదులు చూపించి తప్పించుకుంటున్నారని ఓ ఆఫీసర్​ తెలిపారు. 

సింగరేణి ఆర్జీ 1 ఏరియా పరిధిలోని జీడీకే 1వ గని ఆవరణ నుంచి 500 రూప్​ బోల్ట్స్​ను చోరీ చేసి ఆటోలో తరలిస్తుండగా సుందిల్ల గ్రామ సమీపంలో ఎస్అండ్​పీసీ ఆఫీసర్లు, సిబ్బంది ఇటీవల పట్టుకున్నారు. వీటి విలువ రూ.1.25 లక్షలు. అండర్​ గ్రౌండ్​మైన్​లో బొగ్గును తొలగించిన తర్వాత పైకప్పు కూలకుండా ఈ రూప్​బోల్ట్స్​ను ఉపయోగిస్తారు.’


మాయమవుతున్న స్క్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

సింగరేణిలో కాలందీరిన వాహనాలు, మెషినరీ విడి భాగాలను స్క్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపంలో ప్రతి మైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓచోట నిల్వ ఉంచుతారు. ఆ తర్వాత దానిని వేలం వేసి అమ్మేస్తారు. ఇటీవల 21.27 టన్నుల స్ర్కాప్​చోరీ కాగా సింగరేణి సెక్యూరిటీ ఆఫీసర్లు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ5.25లక్షలు ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. సింగరేణిలో విలువైన బొగ్గు, స్క్రాప్​, ఇతర సామాగ్రి చోరీకి గురవుతున్నా పకడ్బందీ చర్యలు కనిపించడం లేదు. ఎవరైనా పట్టుబడినా వారిపై కేసు నమోదు చేస్తున్నా సీరియస్​యాక్షన్ తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈక్రమంలో చోరీలు కొనసాగుతూనే ఉన్నాయి.