ఐపీఎల్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ జెర్సీపై తెగ ఆసక్తి చూపిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా కోహ్లీ జెర్సీ వేసుకొని సందడి చేస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన అండర్- 19 మ్యాచ్ లో తొలిసారి కోహ్లీ 18 నెంబర్ జెర్సీ వేసుకున్న వైభవ్.. తాజాగా ఇంగ్లండ్ తో అండర్–19 తొలి యూత్ టెస్టులోనూ 18 నెంబర్ జెర్సీ ధరించడం విశేషం. ఈ రెండు మ్యాచ్ ల్లో వైభవ్.. కోహ్లీ జెర్సీ వేసుకోవడం ఆసక్తికరంగా మారింది. కోహ్లీ మీద ఇష్టంతోనే ఈ బీహార్ 14 ఏళ్ళ కుర్రాడు ఇలా ప్రతిసారి 18 జెర్సీలో కనిపిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.
వైభవ్ సూర్యవంశీ '18' నెంబర్ వేసుకోవడంపై భిన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాడని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం తమ ఫేవరేట్ క్రికెటర్ జెర్సీ ఎవరూ వేసుకోవడానికి వీలు లేదని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఇటీవలే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, అతని జెర్సీని ఎవరు వేసుకోవడానికి వీలు లేదని బీసీసీఐని నెటిజన్స్ డిమాండ్ చేశారు. కొంతమంది ఎమోషనల్ కాగా.. మరికొందరు ఆగ్రహానికి గురయ్యారు. అభిమానులకు జెర్సీ నంబర్ 18 ఒక ఎమోషన్. అది వేరే వారు ధరిస్తే జీర్ణించుకోలేరు.
ఇంగ్లాండ్ తో అండర్- 19 మ్యాచ్ లో భాగంగా తొలి వన్డేలో కోహ్లీ జెర్సీ ధరించి సూర్యవంశీ దుమ్ములేపాడు. ఆడింది 18 బంతులే అయినా 48 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ 14 ఏళ్ళ కుర్రాడి ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఇటీవలే ముగిసిన టెస్ట్ మ్యాచ్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. మరోవైపు సూర్యవంశీ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. మరి వైభవ్ సూర్యవంశీ 18 నెంబర్ జెర్సీని ఇప్పటివరకు కొనసాగిస్తాడో చూడాలి.
??????? ?????? ?? ??? ????! ???
— Sportskeeda (@Sportskeeda) July 18, 2025
Vaibhav Suryavanshi was spotted wearing Virat Kohli’s iconic No.18 jersey during India U19’s unofficial Test clash against England U19. ??#ViratKohli #VaibhavSuryavanshi #India #Cricket #Sportskeeda pic.twitter.com/BGoSiyiFZc
